టీవీ సీరియల్ - ఐపీఎల్ మ్యాచ్ వలన నిండు ప్రాణం బలి..       2018-04-16   04:55:33  IST  Raghu V

ప్రతీ రోజూ మన చుట్టూ జరిగే హత్యలు, ,తగాదాలు, గొడవలు అన్నీ చూస్తూనే ఉంటారు అందరూ..చాలా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ చివరికి హత్యల వరకూ వెళ్ళిపోతాయి అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది…కన్న తండ్రి తన కూతురు జీవితాన్నినాశనం చేశాడు తన అల్లుడిని చంపి కూతరు బొట్టు చెరిపేశాడు..అయితే ఆ వ్యక్తి తన అల్లుడిని చంపడానికి జరిగిన కారణం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు..వివరాలలోకి వెళ్తే..

కామారెడ్డి జిల్లా బీర్కూ ర్‌ మండలంలోని బరంగ్‌ఎడ్గి గ్రామానికి చెందిన బుజ్జయ్య కూతురు అక్షితని మంగటి వెంకటి(25) అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు… అయితే అక్షిత మళ్లీ గర్భవతిగా ఉండటంతో పురుడు కోసం పుట్టింటికి వెళ్ళింది. భార్య పుట్టింటికి వెళ్లి చాలా రోజులవడంతో ఆమెను చూడడానికని వెంకటి ఈ నెల తొమ్మిదవ తేదీన అత్తవారింటికి వెళ్లాడు

ఇదిలాఉంటే ఆ రోజు సాయంత్రం టీవి చూసే విషయంలో మామా అల్లుళ్లకి గొడవ జరిగింది. టీవిలో తాను సిరియల్ చూస్తానని మామ…కాదు కాదు ఐపిఎల్ మ్యాచ్ చూస్తానని అల్లుడు ఇలా ఇద్దరు గొడవలు పడ్డారు..మాట మాట పెరగడంతో మామ అల్లుడిపై కత్తితో దాడి చేశాడు..రక్తం ఎక్కువగా కారండంతో హైరాబాద్ లోని నిమ్స్ కి తరలించారు. అయితే గత కొన్ని రోజులగా ఐసీయులో ఉన్న అతను…చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు…అల్లడిపై దాడికి పాల్పడి అతడి హత్యకు కారణమైన మామ బుజ్జయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…గొడవలకి కారణం సీరియల్ నా మరేదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు..