టికెట్ ఇచ్చేటప్పుడు ఆ బస్సు కండక్టర్ అక్కడ తాకాడు.! అనుపమ సంచలన కామెంట్స్!       2018-06-02   01:27:01  IST  Raghu V

ప్రేమమ్ (మలయాళ చిత్రం) మూవీతో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ యువకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు ప్రేమమ్ లోను సుమ గా ఆకట్టుకుంది. అంతకంటే ముందే అ.. ఆ సినిమాలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది.

శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఉన్నదీ ఒక్కటే జిందగీ లోను చక్కగా నటించి మంచి అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం “తేజ్‌ ఐ లవ్‌ యూ”, ‘”హలో గురు ప్రేమకోసమే” చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ నటన అంత ఈజీ కాదంటోంది.

-


రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అమ్మాయిల కష్టాల గురించి చెప్పింది. ‘గతంలో నేనూ అందరిలాంటి అమ్మాయినే. చాలామందిలా వేధింపులు తప్పలేదు’ అంటూ ..ఒక్కోసారి మనకు తెలీకుండానే మనల్ని ఎదుటివాళ్లు వేధిస్తుంటారు.

-

టిక్కెట్ ఇచ్చే వంకతో బస్సులో కండక్టర్ అమ్మాయిల్ని తాకొచ్చు. కానీ ఆ రద్దీలో మనం దాన్ని అంతగా పట్టించుకోం.అంతేకాదు అమ్మాయిలను తప్పుడు ఉద్దేశంతో చూడటం కూడా వేధింపుల్లోఒక భాగమే.

Click Here to Watch Video

ఎవరు ఏ ఉద్దేశంతో తమను చూస్తున్నారో అర్థం చేసుకోవడం అమ్మాయిలకు పెద్ద కష్టమేం కాదు. అలా ప్రవర్తించేవాళ్లంతా తమకూ ఇంట్లో అమ్మలూ, అక్కాచెల్లెళ్లూ ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.