జ్వరం తగ్గటానికి పది ప్రభావవంతమైన ఇంటి నివారణలు

మన శరీరం ఇన్ ఫెక్షన్ లేదా ఫ్లూ మీద పోరాటం చేసినప్పుడు జ్వరం వస్తుంది.జ్వరంను అణచివేయడానికి సలహా లేదు.

 Home Remedies For Fever-TeluguStop.com

ఎందుకంటే బాక్టీరియా మరియు వైరస్ లను చంపటానికి జ్వరం సహాయపడుతుంది.అయితే అధిక జ్వరం (హై ఫీవర్) అనేది చిన్న పిల్లల్లో చాలా ప్రమాదకరం.

అధిక జ్వరం (హై ఫీవర్) ని తగ్గించుకోవటానికి సహజమైన మార్గాలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఒక టబ్ లో గోరువెచ్చని నీరు మరియు అరకప్పు వెనిగర్ పోయాలి.ఆ టబ్ లో 10 నిముషాల పాటు ఉండాలి.

ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ తులసి ఆకులను వేసి కొంచెం సేపు కదపకుండా ఉంచాలి.ఈ నీటిని రోజులో నాలుగు సార్లు త్రాగాలి.

మరుసటి రోజు కూడా జ్వరం ఎక్కువగా ఉంటే, జ్వరం తగ్గి చెమట పట్టటానికి పిప్పరమెంటు,యారో వంటి మూలికలను కూడా ఉపయోగించవచ్చు.పాదాల కింద ఉల్లిపాయ ముక్కను ఉంచి కవర్ అయ్యే విధంగా దుప్పటి కప్పుకోవాలి.

ఒక బౌల్ లో వేడినీరు, ఒక కప్పు వెనిగర్ తీసుకోని కలపాలి.ఆ నీటిలో కాటన్ వస్త్రాన్ని ముంచి పిండి నుదురు మీద ఉంచాలి.

ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ ఆవాలు వేసి కదపకుండా 5 నిముషాలు ఉంచి, ఆ తర్వాత ఆ నీటిని త్రాగాలి.

బంగాళదుంప ముక్కను వెనిగర్ లో పది నిముషాలు నానబెట్టాలి.నెల మీద పడుకొని నుదురు మీద ఒక కాటన్ క్లాత్ వేసి దాని మీద బంగాళదుంప ముక్కలను పెట్టాలి.20 నిమిషాల్లో జ్వరం తగ్గటాన్ని గమనించవచ్చు.

పాదాల అడుగున నిమ్మ కాయ ముక్కలను ఉంచి సాక్స్ తో కవర్ చేయాలి.అలాగే మరొక విధానం కూడా ఉంది.గుడ్డు తెల్లసోనలో కాటన్ వస్త్రాన్ని ముంచి పాదాలకు చుట్టి సాక్స్ తో కవర్ చేయాలి.

రెండు స్పూన్ల ఆలివ్ నూనెలో రెండు వెల్లుల్లి రెబ్బలను చితకొట్టి వేసి వేడి చేయాలి.

ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో పాదాలకు రాసి కాటన్ వస్త్రంతో చుట్టాలి.ఆలివ్ నూనె మరియు వెల్లుల్లి అనేవి జ్వరాన్ని తగ్గించటానికి అద్భుతమైన ఇంటి నివారణలు అని చెప్పవచ్చు.

అధిక జ్వరంతో ఉన్నప్పుడు, అరకప్పు నీటిలో 25 ఎండు ద్రాక్ష ను వేసి నానబెట్టి మెత్తగా చేయాలి.ఈ మిశ్రమంలో అరచెక్క నిమ్మరసం వేసి రోజులో రెండు సార్లు త్రాగాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube