జుట్టుకు రంగు వేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ నేచురల్ కలర్స్ మీ కోసమే       2018-06-01   00:44:00  IST  Lakshmi P

జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు ఆ రంగు పడకపోతే జుట్టు కాంతివిహీనంగా మారుతుంది. అంతేకాక జుట్టు కూడా రాలిపోతుంది. ఆలా కాకుండా జుట్టు బలంగా,ఆరోగ్యంగా,జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ సహజసిద్ధమైన కలర్స్ వాడాలి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ కలర్స్ ని తేలికపాటి షాంపూతో తలస్నానము చేసాక మాత్రమే ఉపయోగించాలి.

జుట్టు బ్రౌన్ కలర్ రావాలంటే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ కాఫీ గింజలు లేదా కాఫీ పొడి వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తలకు బాగా పట్టించాలి. 20 నిముషాలు అయ్యాక జుట్టును కడగాలి.

జుట్టు నలుపు రంగు రావాలంటే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ కాఫీ గింజలు లేదా కాఫీ పొడి,పావు స్పూన్ లవంగాల పొడి వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తలకు బాగా పట్టించాలి. 20 నిముషాలు అయ్యాక జుట్టును కడగాలి.

జుట్టుకు పర్పుల్‌ కలర్‌ రావాలంటే ఒక కప్పు నీటిలో బీట్ రూట్ పేస్ట్ వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి రాత్రి సమయంలో జుట్టు మొత్తానికి పట్టించి తల మాడు మీద 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు పర్పుల్‌ కలర్‌ లోకి మారుతుంది.