జలుబు దగ్గుతో ఇబ్బందిగా ఉందా ? ఐతే మీ ఇంట్లో పసుపు,తులసి ఉన్నాయా?

వానాకాలం వచ్చిందంటే చాలు జలుబు,దగ్గు సమస్యలు వేధిస్తూ ఉంటాయి.జలుబు వచ్చిందంటే ఒంటి నొప్పులు,గొంతు నొప్పి వంటివి కూడా వచ్చేసి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.

 Troubled With A Cold Cough So Do You Have Yellow And Basil In Your House , Basil, Pepper, Turmaric, Lemon-TeluguStop.com

పెద్దవాళ్ళు ఎదో ఒక రకంగా తట్టుకుంటారు.కానీ పిల్లలు అయితే తట్టుకోవటం చాలా కష్టం.

అందువల్ల వారి కోసం కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

 Troubled With A Cold Cough So Do You Have Yellow And Basil In Your House , Basil, Pepper, Turmaric, Lemon-జలుబు దగ్గుతో ఇబ్బందిగా ఉందా ఐతే మీ ఇంట్లో పసుపు,తులసి ఉన్నాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాముపొడి దగ్గు వచ్చినప్పుడు సమయంలో కన్నా రాత్రి సమయంలో ఎక్కువగా వేధిస్తుంది.

దాంతో నిద్ర కూడా సరిగా పట్టదు.రాత్రి పడుకొనే ముందు చిటికెడు వామును బుగ్గలో పెట్టుకొని నిదానంగా నములుతూ రసాన్ని మింగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

తులసిదగ్గును తగ్గించటంలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఉదయం నాలుగు తులసి ఆకులను నమిలితే సరిపోతుంది.తులసిలో కఫాన్ని తగ్గించే లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

దాల్చినచెక్కదాల్చినచెక్కలో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌లను నివారించే లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన జలుబు నుండి తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి రోజులో 2 నుండి 3 సార్లు తీసుకుంటే చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అల్లంఅల్లంలో యాంటీవైరల్‌, ఫంగల్‌ లక్షణాలు అధికంగా ఉండుట వలన జలుబును చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.

అల్లం ముక్కలను నమలవచ్చు.లేదా అల్లం టి త్రాగవచ్చు.

తేనేఅల్లం రసం లేదా నిమ్మరసంలో తేనే కలిపి తీసుకోవాలి.తేనే,నిమ్మరసంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి.అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

మిరియాలుఒక స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడిని కలిపి త్రాగాలి.

ఉదయం సమయంలో తీసుకుంటే ఆ ప్రభావం సాయంత్రం వరకు ఉంటుంది.ఇలా రెండు మూడు రోజులు తీసుకుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది.

Telugu Basil, Lemon, Pepper, Troubledcough, Turmaric-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

పసుపుయాంటీ సెప్టిక్‌ లక్షణాలు ఉన్న పసుపు ఎన్నో వ్యాధులను నయం చేయటంలో సహాయపడుతుంది.దగ్గు,జలుబు ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని త్రాగితే మంచి ప్రభావాన్ని చూపి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

నిమ్మరసంఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే , నిమ్మరసం కలిపి త్రాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు తొందరగా తగ్గిపోతాయి.

వేడి నీటి ఆవిరివేడి నీటి ఆవిరి పట్టినా మంచి ఉపశమనం కలుగుతుంది.10-15 నిమిషాల పాటు ఇలా ఆవిరి పట్టాలి.ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపితే మరీ మంచిది.

శ్వాస సాఫీగా సాగేందుకు ఇది ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube