జనసేన బ్రోకర్ సంస్థనా..?..తీవ్రవిమర్శలు చేసిన బీజేపీ     2018-01-22   04:44:16  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రాజకీయ దాడి మొదలయ్యింది..ఒకపక్క నుంచీ కాంగ్రెస్ మరో పక్కనుంచీ బీజేపి వరుసగా మాటల యుద్ధం చేస్తున్నాయి..ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే బీజేపి చలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. .రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్స్ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు సైతం పవన్ విషయంలో కంట్రోల్ గా మాట్లాడారు కానీ బీజేపి లాంటి పార్టీ మాత్రం తన విశ్వరూపం పవన్ పై చూపించింది..మాటలకి పదును పెంచేసింది..అసలు పవన్ పై బీజేపి చేసిన కామెంట్స్ ఏంటంటే..

బీజేపి అధికార ప్రతినిధి అయిన కృష్ణ సాగర్ రావు పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..దక్షిణ భారతదేశంలో పెరియార్ స్ఫూర్తితో వస్తున్నానని చెప్తున్న పవన్ కల్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని..ప్రాంతీయవాదంతో పబ్బం గడపాలని..అసలు జనసేన రాజకీయ పార్టీనా? బ్రోకరేజ్ సంస్థనా? అంటూ ఘాటుగానే విమర్శించారు “జనసేనకు లోగో ,జెండా ఉంటే సరిపోతుందా కార్యవర్గం ఉండాలిగా అంటూ కామెంట్స్ చేశారు…జనసేన సినిమా విడుదల కాకముందే ఫెయిల్‌ అయింది’ అని విమర్శించారు.

ఒప్కప్పుడు పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళు తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేకం అయ్యారు ఆ సమయంలో పవన్ అమరవీరుల కుటుంబాలపై ,కేసీఆర్ కుటుంబం పై అనేక వ్యాఖ్యలు చేశారు..ఇప్పుడు ఎలా కేసీఆర్ ని పొగుడుతున్నాడు..దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు…అయితే పవన్ వచ్చేది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని చీలచాదానికే అంటూ మంది పడ్డారు.. పవన్ కల్యాణ్‌ది భజన పార్టీ అని, ఏపీలో చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్ పొగడడం అంటేనే.. ప్యాకేజీల పార్టీగా కనబడుతుందని విమర్శించారు.తెలంగాణలో బిర్యానీ తినడం కాదు రాజకీయం అంటే అని అన్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా బీజేపి సైతం పవన్ ని టార్గెట్ చేసిందంటే పవన్ కి చెక్ పెట్టడానికి మరికొన్ని వ్యూహాలు కూడా సిద్దం అయినట్టే అంటున్నారు విశ్లేషకులు..మరి బీజేపి పై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..