“జగన్” పరువుని అడ్డంగా తీసేసిన..“లగడపాటి”       2018-04-14   07:05:33  IST  Bhanu C

లగడపాటి రాజ్ గోపాల్ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన చేసే సర్వేలు..లగడపాటి సర్వేలకి ఏపీలో మాత్రమే కాదు యావత్ దేశంలోనే మంచి గుర్తింపు ఉంది..కేంద్రంలో పెద్దలు సైతం లగడపాటి సర్వేల కోసం ప్రత్యేకంగా ఆసక్తి చూపుతూ ఉంటారు..ఎందుకంటే బడా బడా సర్వేలు సైతం లగడపాటి చేసిన సర్వేల ముందు చిన్న బోయాయి..అంతేకాదు లగడపాటి సర్వేలలో 95 శాతం రిజల్స్ వచ్చేవి దాంతో ఏపీ లో లగడపాటి సర్వేలు అన్ని రాష్ట్రాలకి విస్తరించాయి దాంతో ఎంతో మంది లగడపాటి ని పిలిపించుకుని మరీ సర్వేలు చేయించుకునే వారు..

అయితే క్రిందటి సంవత్సరం జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో లగడపాటి చెప్పింది చెప్పినట్టుగా జరిగింది దాంతో సర్వేల ఫోకస్ అంతా లగడపాటి పై పడింది..ఇదిలాఉంటే ఈ సర్వ్ తాలూకు ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి జిత్తుల మారి వైచీపీ ఎప్పటిలాగానే తన బుద్దిని చాటుకుంది…వైకాపా పెయిడ్ మీడియా లగడపాటి సర్వేలు అంటూ ఒక నెలలో ఏకంగా 4 సర్వేలు జరిగినట్టుగా అవి లగడపాటి సర్వేలు అనేట్టుగా పుకార్లు సృష్టిస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది..తద్వారా ప్రజలలో హైప్ పొందాలని ప్రయత్నం చేస్తోంది.


తాజాగా రెండు రోజుల క్రితం వైసీపి ఫేక్ మీడియాలో లగడపాటి సర్వే అంటూ ఒక సర్వే బయటపెట్టారుఆని సారంశం ఏమిటంటే లగడపాటి సర్వే చేశారని..తెలుగుదేశ౦ పార్టీకి ఈ సర్వేలో అసెంబ్లీ 30 సీట్లు 3 ఎంపీ స్థానాలు వస్తాయని,ఇక వైకాపాకి 138 నుంచి 140 స్థానాలు వస్తాయని అలాగే ఎంపీలు 20 నుంచి 22 మధ్యలో వస్తాయని ఒక ప్రచారం చేస్తున్నారు..అయితే ఇంత దారుణంగా వైసీపి దిగజారిపోవడానికి కారణం ఏమిటనే విషయాని విశ్లేషించిన టిడిపి సీనియర్స్ అసలు విషయం బయటపెట్టారు..

వైకాపా పార్టీ పై ప్రజల్లో క్రమ క్రమంగా నమ్మకం తగ్గిపోతోందట అంతేకాదు జగన్ కి అందిన సమాచారం మేరకు చుట్టూ ఉండే బలమైన నేతలలో వచ్చే ఎన్నకల్లో అయినా అధికారంలోకి వస్తామా రామా అనే అనుమానాలు రావడంతో షాక్ తిన్న జగన్ తన పర్సనల్ మీడియాకి దిశా నిర్దేశం చేశాడని..వారి పార్టీకి మద్దతిచ్చే కొన్ని సామాజికవర్గాల్లో పట్టు నిలుపుకోవటం కోసం ఇలాంటి చవకబారు రాజకీయం చేస్తుంది. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నాడని తెలుస్తోంది..అయితే ఈ తంతు అంతా దగ్గర ఉండి మరీ నడిపించేది ఎవరో కాదు ప్రశాంత్ కిశోరే అని తేలింది దాంతో..

ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన లగడపాటి మీడియా ముందుకు వచ్చి ప్రజలకి క్లారిటీ ఇచ్చారట..ఇలాంటి చవకబారు రాజకీయాలు బీహార్ లో చేసుకో ఇక్కడ కాదు అంటూ ప్రశాంత్ కిషోర్ కి వార్నింగ్ ఇచ్చారట..అంతే కాక లగడపాటి మాట్లాడుతూ ఎప్పుడు సర్వే చేసినా నేను స్వయంగా మీడియా ముందుకి వచ్చి చెప్తాను..ఇలా రెండు రోజులకి ఓ సర్వే నెలకి రెండు మూడు సర్వేలు నేను ఇవ్వను నా సర్వే మొదలుప పెడితే అది కంప్లీట్ అవ్వడానికి మూడు నెలలు పడుతుంది అని చెప్పారు..ఇలాంటి దొంగ సర్వేలు నమ్మకండి అంటూ ప్రజలకి సూచించారట..దాంతో జగన్ అండ్ గ్యాంగ్ మొత్తం పరువు గంగలో కలిసిపోయింది అంటూ టిడిపి నేతలు తెగ సంతోష పడిపోతున్నారు..ఇక మీదట అయినా సరే చీప్ ట్రిక్స్ ఆపండి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..