జగన్ చేతిలో బ్రహ్మాస్త్రం..దీంతో టీడీపీ పని ఖతం       2018-04-14   07:19:18  IST  Bhanu C

ఇప్పటి వరకూ ఉన్న రాజకీయాలు ఒక ఎత్తు ఇక మీదట జరుగబోయే రాజకీయాలు మరొక ఎత్తు..విభజన అంశం దృష్టిలో పెట్టుకుని ఎవరికీ వారు ఏపీ ప్రజల దృష్టిలో హీరోలో అయిపోవాలని వ్యూహ రచనలు చేస్తున్నారు ఒక పక్క అస్సలు ప్రత్యేక హోదా అవసరం లేదు అన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తూచ్ అంటూ ప్రత్యేక హోదా ముద్దు అంటూ యూ టర్న్ తీసుకున్నారు..నిరాహార దీక్షలు..నిరసనలు,ర్యాలీలు అంటూ మరో పక్క ప్రజలని ఊదర గొడుతూ వారి వారి పబ్బం గడుపుతున్నారు..మోడీ తో డీ అంటే డీ అంటున్నారు…ఇదిలాఉంటే

-

- Telugu

అసలు ముందు నుంచీ ప్రత్యేక ఉద్యమాన్ని భుజాన మోసింది మాత్రం వైసీపి అనడంలో సందేహం లేదు..కేంద్రంపై అవిశ్వాసాన్ని ఎక్కుపెట్టి ప్రతిపక్ష పార్టీ పాత్రని ఎంతో భాద్యతగా నిర్వర్తించింది..ఏపీలో నిరాహార దీక్షలు చేస్తూ కేంద్రంపై కాలు దువ్వుతూ ఏపీ ప్రజల హక్కుని తన పార్టీ తరుపున అడిగింది..వాస్తవానికి జగన్ ముందుకు కదిలిన తరువాతనే పవన్ కళ్యాణ్ కానీ ,తెలుగుదేశం కానీ ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు..అయితే కేంద్రానికి సవాల్ విసురుతూ మరింత ఒత్తిడి పెరిగేలా తన ఎంపీల చేత రాజీనామాలు చేయించాడు జగన్ మోహన్ రెడ్డి..దాంతో ఒక్కసారిగా కేంద్రంపై తీవ్రమైన ప్రభావం ఏర్పడింది..

అయితే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా ఎందుకు ఆమోదం పొందలేదు దీనికి కారణం కేవలం వైసీపి ,బీజేపి ఒప్పందమే అంటూ వైసీపిని ఇరుకున పెట్టాలని భావించారు…స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు సమర్పించామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారని, కాని వారి రాజీనామాలు మాత్రం స్పీకర్ పట్టించుకోవడం లేదన్న విమర్శలను టీడీపీ చేస్తోంది..అయితే జగన్ ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ అధినేత జగన్ మరో నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందలేక పోవడానికి కారణాలు స్పీకర్ నే అడిగి తెలుసుకోవాలని ఒకవైపు విమర్శలకు సమాధానం చెబుతూనే, మరోవైపు ఎమ్మెల్యేల చేతకూడా రాజీనామాలు చేయించలని జగన్ భావిస్తున్నారు.

అయితే ఈ విషయంపై ఇప్పటికే జగన్ తన ఎమ్మెల్యేలతో చర్చించినట్టుగా తెలుస్తోంది..ఈ మేరకు జగన్ శిబిరంలో కలసిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తేనే ప్రత్యేక హోదా విషయంలో మరింత ముందున్నట్లు అవుతుందని అభిప్రాయపడినట్లు సమాచారం…అంతేకాదు టిడిపి చేస్తున్న వ్యాఖ్యలకి అడ్డుకట్ట వేయచ్చు అంటూ మూకుమ్మడి రాజీనామాలకి సైతం డిసైడ్ అయ్యారట..ఉన్నది ఏడాది సమయం ఈ సమయంలో గనుకా రాజీనామాలు చేస్తే ఏపీలో ప్రజల దృష్టిలో జగన్ హీరో అవుతాడు..అంతేకాదు రాజీనామాల ఆమోదం విషయంలో టిడిపి ప్రభుత్వం తర్జన బర్జన పడటం ఖాయమని తెలుస్తోంది..