6 నెలల్లో నేనేంటో చూపిస్తానంటున్న జగన్‌  

జగన్‌ Ys Jagan Speech After Win In Elections 2019-ex Cm Chandra Babu Naidu,old Cm Chandra Babu Naidu,tdp,ys Jagan,ysrcp,జగన్,మాజీ సి‌ఎం చంద్ర బాబు నాయుడు,మాజీ సి‌ఎం బాబు,సి‌ఎం వైఎస్ జగన్

ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అయ్యారు. ఒకటి రెండు సీట్లు మినహా మొత్తంగా ఫలితంపై క్లారిటీ వచ్చేసింది. 175 సీట్లకు గాను 150కి పైగానే వైకాపా సాధించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి..

6 నెలల్లో నేనేంటో చూపిస్తానంటున్న జగన్‌-జగన్‌ Ys Jagan Speech After Win In Elections 2019

ఫలితాల నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ మీడియా ముందుకు వచ్చాడు.

తాడేపల్లిలోని వైకాపా కార్యలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన చాలా హుందాగా, తక్కువగా మాట్లాడటం జరిగింది.

అయిదు కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే సీఎం అయ్యే ఛాన్స్‌ ఉంటుంది. ఆ ఛాన్స్‌ నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయం నాకు మరింత బాధ్యతను పెంచింది.

నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ జగన్‌ చెప్పుకొచ్చాడు.

ఏపీ సీఎంగా తాను ఆరు నెలల్లోనే ఏంటో నిరూపించుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆరు నెలల్లోనే జగన్‌ మంచి సీఎం అనిపించుకుంటాను అంటూ జగన్‌ హామీ ఇచ్చాడు.

ఇక తాను మొదటి నుండి చెబుతున్నట్లుగా నవరత్నాల హామీలకు మొదటి సంతకం పెట్టబోతున్నట్లుగా ఈ సందర్బంగా జగన్‌ అన్నాడు. మొత్తానికి పార్టీ పెట్టిన పదేళ్లకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో జగన్‌ కు పెద్ద ఎత్తున అభినందలు వెళ్లువెత్తుతున్నాయి.