ఛాయ్ అమ్మి 45 కోట్లు సంపాదన .. ఎలాగో తెలిస్తే షాక్       2018-05-21   00:29:25  IST  Raghu V

ఈ పాట గుర్తుంది కదూ , ఛాయ్ గొప్పతనం గురించి చిరంజీవి సినిమా పాటలో విన్నాం ,కానీ ఆ ఛాయ్ తో మిలియనీర్ అయిన ఒక మహిళ కథ ఛాయ్ అంటే భారతీయులకు ప్రాణం ఎక్కడ ఉన్నా పని చేసాక అలసట తీర్చువడానికి ఛాయ్ తాగుతం దానితో మనకు కొత్త ఉల్లాసం వస్తుంది.టీ అమ్మి మన దేశానికి ప్రధాని అయినపుడు టీ తో 45 కోట్లు సంపాదించండం ఏముంది. చాయ్ తో రోజుకు వెయ్యి సంపాదించడం చాలా కష్టం, మనకి ఒక 100 టీ షాప్ లు ఉన్న కోట్ల బిసినెస్ చేయడం మాములు విషయం కాదు , కానీ ఒక మహిళ ఏకంగా 45 కోట్ల రూపాయలు కేవలం టీ అమ్మి సంపాదించింది.నమ్మశక్యం లేదా.. ఈ విషయం చెప్పింది అమెరికన్ వీక్లీ మ్యాగజైన్ ,అది కూడా మన దేశ ఛాయ్ పుణ్యమే మరి..

అసలు కథేంటి?

ఛాయ్ అమ్మితే కోట్లు వస్తాయా అని ఆలోచన వస్తుంది కదూ, అసలు విషయం ఏంటంటే అమెరికా లో కాలరాడో కు చెందిన మహిళ బ్రూక్ ఎడ్డీ 2002 లో భారత్ కి వచ్చింది.దేశం లో ఉన్న చాలా పర్యాటక ప్రాంతాలను తిరిగింది , ఆ సమయం లో మన దేశ వంటకాల రుచి చూసింది. ఇక్కడ టీ ఆమెకి విపరీతంగా నచ్చింది. ఆ పర్యటన ముగించుకొని తిరిగి కాలరాడో కి వెళ్ళింది , అక్కడ కేఫ్ లో టీ తాగింది , అయితే భారత్ లో ఉన్న టీ లాగా రుచిగా అక్కడి టీ లేకపోవడం తో ఆమెనే ఒక టీ స్టాల్ లాగా ఒక కేఫ్ పెట్టాలని అనుకుంది.

భక్తి చాయ్

తనకి ఆలోచన వచ్చిన కొన్ని రోజులకే భక్తి ఛాయ్ అనే పేరు తో టీ వ్యాపారం ప్రారంభించింది. ఈ టీ కి అక్కడ నివసిస్తున్న వారంతా అలవాటు అయిపోయారు. రోజు రోజు కి భక్తి ఛాయ్ పేరు నలు మూలాల వ్యాపించింది. చాలా మంది ఆ ఛాయ్ కోసం దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆమె వ్యాపారం 7 మిలియన్ ల డాలర్ల కు చేరుకుంది. ఈ సందర్బంగా అమెరికన్ వీక్లీ మ్యాగజైన్ ఇంటర్వ్యూ తీసుకోగా ఆమె తనకి ఏ విదంగా ఆలోచన వచ్చిందో చెప్పింది. 2002 లో తను భారత్ కి వెళ్ళినప్పుడు అక్కడ టీ తనకి బాగా నచ్చిందని ఆ టీ రుచి అమెరికా ప్రజలకి కూడా చూపించాలనుకున్నా అంటూ చెప్పింది. అందుకే భక్తి ఛాయ్ పెరు తో గత 15 సంవత్సరాలు గా వ్యాపారం చేస్తున్న ఈ వ్యాపారం నాకు మంచి లాభాలను మరియు పేరుని తీసుకొచ్చింది అని చెప్పింది.

మన దేశం లో టీ అమ్ముకొని వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యాడు , అదే టీ అమెరికా లో అమ్ముకొని ఎడ్డీ మిలియనీర్ అయింది.