చేప ప్రసాదం ఆస్తమాకు ఎంత మేరకు మేలు చేస్తుంది? అసలు ఇది ఎలా మొదలైంది.?       2018-06-08   00:32:07  IST  Raghu V

చేపప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం అయ్యింది. ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున తరలిరానున్న జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది.మృగశిర కార్తె సందర్భంగా ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయడం 173 ఏళ్ల నుంచి పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

దేశవిదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి చేపప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇవాళ, రేపు జరగనున్న చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆస్తమా రోగులకు బత్తిని వంశస్తులు పంపిణీ చేసే చేపప్రసాదానికి ఎంతో పేరుంది. అయితే ఈ చేప ప్రసాదం అస్తమాను నిజంగానే తగ్గిస్తుందా? లేక హానికరమా? ఇంతకీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేప ప్రసాదం గతం, ఘనత ఏంటి?

-

ఏటా లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు హైదరాబాద్ వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఈ పరంపర ఇప్పటిది కాదు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు

-

అపట్లో ఓల్డ్ సిటీలోని దూద్‌బౌలిలో కొద్దిమంది ఆస్తమా రోగులకు ఈ ప్రసాదాన్ని అందించడం ద్వారా ఈ బృహత్తర కార్యక్రమం మొదలైంది. కొరమీను చేపపిల్ల నోటిలో ఆ ప్రసాదాన్ని ఉంచి రోగి చేత ఆ చేప పిల్లను మింగిస్తారు. శాకాహారుల కోసం బెల్లంతో ప్రసాదాన్ని అందిస్తారు.

-

వీటితో పాటు ఇంటి వద్దకు తీసుకెళ్లి స్వీకరించేందుకు కార్తి ప్రసాదం అందిస్తారు. ఇక ప్రసాదం స్వీకరించే వారు గంట ముందు నుంచి ఏమీ తినకూడదు. అలాగే ప్రసాదం స్వీకరించాక గంట సమయం పాటు ఏదీ తినకూడదు. మూడు సంవత్సరాల పాటు ప్రతి ఏటా ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆస్తమా తగ్గుతుందనే నమ్మకం ప్రబలంగా ఉంది.

-

అంతేకాదు దీని వెనకాల ఒక కథ కూడా ఉంది. 1847 ప్రాంతంలో ఒక సాధువు బత్తిన వంశానికి చెందిన వీరన్న గౌడ్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. జోరు వానలో తడిసిపోయిన వచ్చిన ఆ సాధువుకి వీరన్న గౌడ్ భక్తిగా సేవలు చేశారు. అందుకు మెచ్చి ఆయన ఆస్తమా మందు ఎలా తయారు చేయాలో చెప్పి దాన్ని ఏటా మృగశిర కార్తె రోజున ఉచితంగా పంపిణీ చేయమని చెప్పి వెళ్లాడు. అప్పట్నుంచీ బత్తిని వంశజులు శతాబ్దమున్నరకు పైగా విజయవంతంగా చేప ప్రసాదం రోగులకు అందిస్తూ వస్తున్నారు.

-

ప ప్రసాదం హానికరమని ఎక్కడా నిరూపించబడలేదు. అలాగే శాస్త్రీయత కూడా ఋజువు కాలేదు.