చెవులు కుట్టించటం వెనక ఉన్న పరమార్ధం ఏమిటి?  

మన సంప్రదాయంలో ఆడపిల్లలకు చెవులు కుట్టించటం అనేది ఒక ఆచారంగా ఉంది.ఆడపిల్ల జీవితంలో మేనమామ పాత్ర చెవులు కుట్టించే కార్యక్రమం నుండి మొదలు అవుతుంది.మేనమామ ఒడిలో కూర్చోబెట్టి చెవులు కుట్టిస్తారు.కొంత మంది మగపిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు.కొంత మంది చెవులు కుట్టించటం అలంకారం కోసం అని భావిస్తారు.మరి కొంత మంది మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉంటారు.అయితే ఆడపిల్లల విషయంలో ఆచారపరంగా వచ్చిన ఆభరణాలు … అలంకరణల వెనుక అసలైన అర్థాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే వున్నాయి.ఈ ఆచారం వెనక కూడా ఆరోగ్యకరమైన కారణం ఉంది.చెవులు కుట్టించటం అనేది ‘ఆక్యుపంక్చర్’వైద్య విధానానికి సంబంధించింది.ఈ వైద్య విధానం చైనా ప్రాచీన వైద్యం.చెవులను కుట్టించటం వలన చెవులకు సంబందించిన వ్యాధులు రావు.అంతే కాకుండా దృష్టి దోషాలు … మూర్చలు … రక్తపోటు … ఆయాసం వంటి వ్యాధులకు దూరంగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు.అందుకే మన పెద్దవారు ఆచారం పేరుతొ చెవులను కుట్టించే విధానాన్ని పెట్టారని చెప్పవచ్చు.

%e0%b0%9a%e0%b1%86%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%9f%e0%b0%82 %e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b0%95 %e0%b0%89--