చూపించడానికి నాకు సిగ్గు లేదు అంటున్న టాప్ హీరోయిన్     2017-09-16   04:28:32  IST  Raghu V

-

-

ఒకదాని తరువాత ఒకటి, మొత్తానికి తాప్సి మాత్రం నిత్యం వార్తల్లో ఉంటోంది. మొన్నటిదాకా రాఘవేంద్రరావు హీరోయిన్ల నడుము చూపించే విధానంపై సంచలన కామెంట్స్ చేసి ఓ నెలరోజుల పాటు వేడి వేడి డిబేట్స్ లో వార్తగా నిలిచిన తాప్సి, ఆ తరువాతా క్షమాపణలు చెప్పి, వాతావరణాన్ని ఎంతోకొంత చల్లబరిచే ప్రయత్నం చేసింది. ఆ టాపిక్ జనాలు మరచిపోయారు. ఇప్పుడు కొత్తగా బికినీ టాపిక్.

తాప్సి నటించిన జుడ్వా 2 విడుదలకి సిద్ధంగా ఉంది. ఇదే నెల 29న సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో తాప్సి చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఓ పాటలో టూ పీస్ బికినీ కూడా వేసింది. అది కామన్ విషయమే అనుకోండి. కాని తాప్సి తానూ బికినీ ధరించిన రెండు ఫోటోలని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఓ కొత్త వివాదం మొదలైంది. తాప్సి పెట్టిన పోస్టు మీద ఎన్నో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. భారత దేశం స్త్రీల పరువు తీస్తోంది, మీ ఇంట్లో వాళ్ళు ఇవి చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు అనుకుంటా అంటూ తాప్సి మీద పడ్డారు కొందరు నేటిజన్స్. వారికి తాప్సి తన స్టయిల్లో అక్కడే బదులు ఇచ్చింది, అది వేరే విషయం అనుకోండి.

ఈ వివాదం మీద IANS తో మాట్లాడిన తాప్సి, కొన్ని బోల్డ్ సమాధానాలు చెప్పింది. “భారతీయ సంస్కృతి గురించి నాకు బాగా తెలుసు. నేనేమి సిగ్గుపడను. పాతరోజుల్లో, పురాణకాలంలో కూడా స్త్రీలు చిన్న చిన్న బట్టలు వేసుకునేవారు. వారిని మాత్రం ఎవరు ఏమి అనలేదు. ఆ తరువాతే సంస్కృతి పేరుతొ కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. మన దేశంలో అమ్మాయి పుట్టినప్పటి నుంచి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ చెబుతారు. కాని ఒక అమ్మాయికి తనకి నచ్చినట్లుగా ఉండే స్వేచ్చను ఇవ్వరు. బికినీ వేస్తె నప్పే శరీర ఆకృతి ఉండి, దాన్ని ఆత్మవిశ్వాసంతో తోడగగలిగితే, బికినీ వేసుకొని శరీరాన్ని చూపించడంలో ఎలాంటి తప్పు లేదు” అంటూ చెప్పుకొచ్చింది తాప్సి.