చుండ్రు సమస్య వేధిస్తోందా....అయితే ఈ ఆయిల్స్ ట్రై చేయండి

చుండ్రు రావటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి.చుండ్రు ఉన్నప్పుడు త‌ల‌పై ఉన్న చ‌ర్మం పొట్టుగా మారి రాలుతుంది.

 Best Essential Oils For Dandruff-TeluguStop.com

ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, పోష‌ణ లోపం వంటి అనేక కార‌ణాలు చుండ్రు రావ‌డానికి కార‌ణ‌మ‌వుతాయి.అయితే ఈ చుండ్రు సమస్య నుండి బయట పడటానికి కొన్ని సమర్ధవంతమైన ఆయిల్స్ ఉన్నాయి.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

టీ-ట్రీ-ఆయిల్ టీ-ట్రీ-ఆయిల్ లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రుకు కారణం అయినా బ్యాక్టీరియాను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.మనం రెగ్యులర్ గా వాడే షాంపూలో కొన్ని చుక్కల టీ-ట్రీ-ఆయిల్ వేసి తలస్నానము చేయాలి.ఈ విధంగా వారంలో ఒకసారి చేయాలి.

చమోమిలే ఆయిల్ చమోమిలే ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రును తగ్గించటమే కాకూండా తల మీద ఉండే ఉద్రిక్తతలను తగ్గిస్తుంది.మనం రెగ్యులర్ గా వాడే నూనెలో కొన్ని చుక్కల చమోమిలే ఆయిల్ వేసి కలిపి తలకు రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

యూకలిప్టస్ ఆయిల్ యూకలిప్టస్ ఆయిల్ లో చుండ్రుకు కారణం అయినా బ్యాక్టీరియాను వదిలించుకోవటానికి అవసరమైన ఏజెంట్లను కలిగి ఉంటుంది.

అలాగే ఈ ఆయిల్ దురద నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.మనం రెగ్యులర్ గా వాడే షాంపూలో 7 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ కలిపి తలస్నానము చేయాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube