చీకటి పడ్డాక చీపురుతో ఇల్లు ఊడవకూడదని అంటారు....ఎందుకు?       2018-05-16   23:26:29  IST  Raghu V

సాధారణంగా ఈ తరంలో చూసుకుంటే ఆచార సంప్రదాయాలను మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తున్నారు. కానీ మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచార వ్యవరాలల్లోను సైన్స్ దాగి ఉంది. అలాగే ఆచారాల వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. అలాంటి ఆచారాలలో ఒకటైన చీకటి పడ్డాక చీపురుతో ఇల్లు ఊడవకూడదని అంటారు….దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అయితే ప్రతి ఇంటిలోనూ కరెంట్ ఉంది. పూర్వం రోజుల్లో కిరోసిన్ దీపాలే ఆధారం.

చీకటి పడితే ఆ దీపాల వెలుగే ఆధారం. ఆ వెలుగు మరి ఎక్కువగా ఉండదు. ఆ సమయంలో చీపురు పట్టుకొని ఊడిస్తే మనకు కన్పించిన విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చీకటి పడ్డాక చీపురుతో ఉడ్చినప్పుడు ఏమైనా పురుగులు,కీటకాలకు చీపురు తగిలితే అవి కుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పాములు,తేళ్లు అయితే ప్రమాదకరమైనవి. కనుక చీకటిలో రాత్రి సమయంలో ఊడవటం మానేసేవారు. అలాగే సైన్స్ పరంగా చూస్తే….రాత్రి సమయంలో చీకటిలో ఉడ్చినప్పుడు దుమ్ము,ధూళి తినే ఆహార పదార్ధాలపై పడితే మనకు కన్పించదు. దుమ్ము,ధూళి పడిన ఆహారం తింటే అనారోగ్యం కలుగుతుంది. ఈ కారణాలతో మన పెద్దవారు రాత్రి సమయంలో చీపురు పట్టుకొని ఊడవవద్దని చెప్పారు. ఈ ఆచారాన్ని ఇప్పటికి చాలా మంది పాటిస్తున్నారు.