చిరు చిన్నల్లుడిలో పవర్‌ ఏది?       2018-05-27   01:54:30  IST  Raghu V

మెగా స్టార్‌ ఫ్యామిలీ నుండి మరో హీరోగా కళ్యాణ్‌ దేవ తెరంగేట్రంకు రంగం సిద్దం అయ్యింది. మెగా ఫ్యామిలీ నుండి పలువురు హీరోలు ఉన్నప్పటికి కళ్యాణ్‌ దేవ్‌పై ప్రత్యేక దృష్టితో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రస్తుతం కళ్యాణ్‌ మొదటి సినిమా ‘విజేత’ చివరి దశ చిత్రీకరణలో ఉంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘విజేత’ చిత్రం జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే టైటిల్‌ లోగోను ఆవిష్కరించిన చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా కళ్యాణ్‌ దేవ్‌ ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేశారు. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో విజేత ఫస్ట్‌లుక్‌ లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే కళ్యాణ్‌లో మెగా ఫ్యాన్స్‌ ఆశించిన మాస్‌ ఎలిమెంట్స్‌ లేవు.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అనగానే ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకుంటారు. యాక్షన్‌ సినిమా అయితే హీరో చాలా మాస్‌గా, యాంగ్రీగా కనిపిస్తాడు. అదే వ్‌ స్టోరీ అయితే రొమాంటిక్‌గా, లవర్‌తో పాటు కనిపిస్తాడు. కాని ఈ ఫస్ట్‌లుక్‌లో కళ్యాణ్‌ చాలా సింపుల్‌గా కనిపించాడు. సినిమా ఓపెనింగ్‌ స్టిల్‌ను ఫస్ట్‌లుక్‌ కోసం వాడారా అన్నట్లుగా ఉంది. ఇది ఒక సినిమా స్టిల్‌ మాదిరిగా లేదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ లేకుండా కళ్యాణ్‌ ఫస్ట్‌లుక్‌ ఉండటంతో ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్‌ుక్‌ చూస్తుంటే కళ్యాణ్‌ నటనలో ఓనమాలు కూడా నేర్చుకున్నట్లుగా లేడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి తన అల్లుడి ఎంట్రీ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదని, ఆయన అజాగ్రత్త వల్ల కళ్యాణ్‌ కెరీర్‌ మొత్తానికే నాశనం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొదటి సినిమాతో ఆకట్టుకోలేక పోతే ప్రేక్షకులు ఎప్పటికి కూడా కళ్యాణ్‌ దేవ్‌ను మాస్‌ హీరోగా ఒప్పుకోరు అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. కళ్యాణ్‌ దేవ్‌ను ఒక యాక్షన్‌ హీరోగా చూపించే ప్రయత్నం చేస్తే బాగుండేది అని, యాక్షన్‌ సినిమాల తర్వాత ఎలాగూ రొమాంటిక్‌గా సినిమాలు చేసేవాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకోలేక పోవడంతో, సినిమాపై కూడా అంచనాలు తగ్గుతున్నాయి. విడుదల సమయంకు టీజర్‌ మరియు ట్రైలర్‌లు విడుదల చేయడం, అందులో కళ్యాణ్‌ సత్తా చాటడం చేస్తే తప్ప సినిమాకు క్రేజ్‌ దక్కదు. మరి దర్శకుడు రాకేశ్‌ శశి ఏం చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించింది. సాయి కొర్రపాటి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.