చింతమనేని పై బాబు సర్వే .. టికెట్ కట్ ..?       2018-06-02   01:09:35  IST  Bhanu C

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ .. టీడీపీకి కంటిలో నలుసులా మారిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఈసారి ఎన్నికల్లో సీటు దక్కడం కష్టమే అని తెలుస్తోంది. మొదటి నుంచి ప్రభాకర్ ది వివాదాస్పద వ్యవహారశైలి. అధినేత చంద్రబాబు ఆయన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన మాత్రం తన బాట తనదే అన్నట్టు ముందుకు వెళ్లిపోతుంటాడు. నియోజకవర్గం లో కూడా అభివృద్ధి ని పట్టించుకోకుండా ఒక నియంతృత్వ ధోరణిలో అధికారులను, సామాన్యులను వేధిస్తున్నాడని ప్రచారం ఉంది. నరనరాల్లో పసుపురక్తం నిండిన వారు కూడా ఇప్పుడు టీడీపీకి దూరం జరిగి పక్కపార్టీల వైపు చూస్తున్నారంటే దానికి ప్రభాకర్ వ్యవహార శైలే కారణం. ఇప్పుడు చంద్రబాబు కూడా ఈ నియోజకవర్గంపై చేయించిన సర్వేలో కూడా ఇదే తేలడంతో చింతమనేని ని పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నాడు అధినేత చంద్ర బాబు .
-

- Telugu

ఇటీవల జగన్ చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తయ్యింది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తున్నార‌ని తెలుసుకున్న దెందులూరు ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. ఈ విష‌యం తెలిసిన సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తుతం దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యం పై చిన్న‌పాటి స‌ర్వే చేయించార‌ట‌. ఆ స‌ర్వేలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు తమ‌ అభిప్రాయాన్ని వ్య‌క్త ప‌రిచారు. అందుకు కార‌ణం, దెందులూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిని చింత‌మ‌నేని ప‌ట్టించుకోక‌పోవ‌డం, అలాగే, మ‌హిళ‌ల‌పై చింత‌మ‌నేనితో స‌హా త‌న అనుచ‌రులు చేస్తున్న దాడులేన‌ట‌. ఈ విష‌యాల‌ను స‌ర్వే సంద‌ర్భంగా ప్ర‌జ‌లే చెప్పారు.

అందుకే రాబోయే ఎన్నిక‌ల్లో దెందులూరు ఎమ్మెల్యే అభ్య‌ర్థిని మార్చాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు సీఎం చంద్ర‌బాబు. ఈ విషయం ప్రభాకర్ చెవిన పడడంతో … త‌న‌కు మ‌ళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు విముఖ‌త చూపితే.. త‌న భార్య రాధ రాణిని తెర‌పైకి తీసుకొచ్చే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఆ క్ర‌మంలోనే ఆమెకు రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప‌నిలో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే బాబు మనసులో ఏముంది అనేది మాత్రం ఏముందో తెలియదు. ఒకవేళ చింతమనేని భార్యకు టికెట్ ఇచ్చినా .. ప్రభాకర్ పెత్తనమే కొనసాగుతుంది తప్ప ఇంకో మార్పు మాత్రం కనిపించదు.