చాందినీని హత్య చేసిన తరువాత వాడు ఏమి చేశాడో తెలుసా       2017-09-14   03:50:17  IST  Raghu V

చాందినీ హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు మీసాలు కూడా సరిగా రాని 17 ఏళ్ల వయసున్న మైనర్ బాలుడి తీరు చుస్తే పోలీసులకి ఒళ్ళు జలజరించింది.హత్యానంతరం ఎ మాత్రం భయం లేకుండా ఉన్న తన ప్రవర్తన చూసి పోలిసులకే షాక్ అయ్యారు.చాందిని హత్యానంతరం తన ఇంటికి సాఫీగా వచ్చి తానూ ఎంతగానో ఇష్టపడే ఎస్కోబార్ వెబ్ సిరీస్ చూశాడు.

ఎస్కోబార్ వెబ్ సిరీస్ అంటే ఏమిటి..అసలు ఈ హత్య చేసిన మైనర్ బాలుడికి ,ఈ సిరియల్ కి సంభందం ఏమిటి అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. అసలు ఎస్కోబార్ సిరీస్ కంటెంట్ ఏమిటి అంటే 1993లో చనిపోయిన కొలంబియన్ డ్రగ్స్ కింగ్. ఈ డాన్ జీవితాన్ని నెట్ ఫ్లిక్స్ అనే సంస్థ రూపొందిస్తే.. దాన్ని నార్కోస్ అనే పేరుతో సీరియల్ గా ప్రసారం చేస్తోంది. ఈ క్రైం సీరియల్ ను ప్రసారం చేయటానికి అమెరికన్ ఛానళ్లు నో చెప్పటంతో దీన్ని. .వెబ్ సిరీస్ గా రిలీజ్ చేశారు. దీని రేటింగ్ చూస్తే మెంటలెక్కాల్సిందే. అస్కార్ అవార్డు సినిమాలకు డబుల్ రేటింగ్ ఉండే ఈ సినిమాని ఈ కుర్రాడు చాలా ఇంట్రెస్ట్ గా చుసేవాడట.

ఈ క్రైమ్ సీరియల్ ప్రభావం తన మీద చాలాఉందని అందుకే ఎ ఆయుధం లేకుండానే చాందిని ని హత్య చేశాడట. హత్య తరువాత తన ఇంటికి వెళ్లి చాలా కూల్ గా క్రైమ్ సీరియల్ చూసాడట.ఈ విషయాలన్నీ చెప్తుంటే పోలీసులు సైతం షాక్ తిన్నారట. పోలీసులు చాందినీ డెడ్ బాడీ ని గుర్తించిన తరువాత అనుమానితుల లిస్టు రెడీ చేశారట అందులో ఈ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే.

టీవీ పుటేజ్ ను పరిశీలించిన పోలీసులు చాందినితో వెళుతున్నది ఈ కుర్రడిగానే గుర్తించారు. అయితే అతన్ని విచారించిన సమయంలో తాను చెప్పే సమాధానాలు పోలీసులకి సైతం అనుమానం రాకుండా చేశాయి. హత్య జరిగిన రోజు తానూ క్రికెట్ ఆడుకున్నాను అని..ఇలా పోలీసులు అడిగిన ప్రతీ ప్రశ్నకి తడబడకుండా సమాధానం చెప్పడంతో పోలీసులు అనుమానించక పోయినా తరువాత హంతకుడు ఆడిన మైండ్ గేమ్ ని పోలీసులు చేదించారు..ఇంక తప్పించుకునే దారి లేక ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఈ బాలుడు హత్య ఎందుకు చేశాడు అనే విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక హత్య చేసి ఇంత కూల్ గా వచ్చి కూర్చుని సీరియల్ చూడటం నిజంగానే షాక్ కలిగించింది అని పోలీసులు చెప్తున్నారు.

,