చర్మంపై దద్దుర్లు,దురద తగ్గాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు  

 • దద్దుర్లు వచ్చాయంటే విపరీతమైన దురద,మంట వస్తాయి. దురద అనేది కొన్ని రకాల ఆహార పదర్ధాల కారణంగా వస్తుంది. దద్దుర్లు కొన్ని కీటకాలు కుట్టినప్పుడు కూడా వస్తాయి. అయితే దద్దుర్లు వచ్చినప్పుడు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం కూడా లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

 • -

 • కొబ్బరినూనె
  దద్దుర్లు ఉన్న ప్రదేశంలో కొంచెం కొబ్బరి నూనె రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తూ ఉండాలి. కొబ్బరి నూనె మాయిశ్చ‌రైజ‌ర్‌లా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియ‌ల్ లక్షణాలు ఉండుట వలన దురదను తగ్గించి దద్దుర్ల మంటను తగ్గిస్తుంది. అయితే ఆర్గానిక్ కొబ్బరినూనెను మాత్రమే ఉపయోగించాలి.

 • కలబంద
  దద్దుర్లు వచ్చిన ప్రదేశంలో తాజా కలబంద జెల్ ని రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కలబందలో మాయిశ్చ‌రైజింగ్, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ లక్షణాలు ఉండుట వలన దద్దుర్ల నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. దద్దుర్లకు కలబంద మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు.

 • పసుపు
  ఒక గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి త్రాగాలి. అంతేకాక పసుపులో నీటిని కలిపి పేస్ట్ గా చేసి దద్దుర్లు ఉన్న ప్రదేశంలో రాస్తే దద్దుర్ల మంట నుండి ఉపశమనం కలుగుతుంది. పసుపులో యాంటీ-ఇన్‌ఫ్ల‌మేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉండుట వలన దద్దుర్ల నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. దద్దుర్ల ఉపశమనం కొరకు పసుపు ఉత్తమమైన ఇంటి చిట్కాగా చెప్పవచ్చు.

 • గ్రీన్ టీ
  ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత తేనే కలిపి గోరువెచ్చగా ఉన్నపుడే త్రాగాలి. రోజులో మూడు సార్లు ఈ పానీయాన్ని త్రాగాలి. గ్రీన్ టీలో ఉండే పాలీ ఫినాల్స్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన దద్దుర్ల వలన కలిగే మంటను తొందరగా తగ్గిస్తుంది. గ్రీన్ టీ దద్దుర్లకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.