చరణ్‌ చేయని సాయం, బన్నీ చేశాడు     2018-05-04   00:08:31  IST  Raghu V

ఎంత పెద్ద స్టార్‌ అయినా, నిర్మాత అయినా కొన్ని సార్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో తమ అనుకున్న వారు సాయం చేయాలి లేదంటే కనీసం అండగా అయినా నిలబడాలి. అలా సాయం చేసిన వారే అసలైన ఆప్తులు. నాగబాబు నిర్మాతగా ‘ఆరంజ్‌’ వల్ల ఎంతగా నష్టపోయాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ నష్టంను భర్తీ చేసేందుకు చిరంజీవి కుటుంబం ఏమాత్రం ముందుకు రాలేదు. అయితే పవన్‌ మాత్రం తనకు తోచిన సాయంను చేశాడని మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే నాగబాబు మళ్లీ ఆర్థికంగా గాడిన పడ్డాడు.

తాజాగా అల్లు అర్జున్‌తో నాగబాబు ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. బాబాయి తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు చరణ్‌ తన డేట్లు ఇచ్చి ఉంటే ఆయన ఆర్థికంగా ఎప్పుడో మళ్లీ కుదుట పడేవారు. కాని చరణ్‌ మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. చిరంజీవి కూడా మరోప్రయత్నం చేయి అంటూ మద్దతుగా నిలిచింది లేదు. దాంతో నాగబాబు ఇన్నాళ్లు నిర్మాణంకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చాడు. తాజాగా అల్లు అరవింద్‌ సూచన మేరకు, అల్లు అర్జున్‌ మద్దతుతో నిర్మాతగా సినిమా చేశాడు. బన్నీ డేట్లు ఇవ్వడంతో తెలివిగా లగడపాటి శ్రీధర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. పెద్దగా పెట్టుబడి లేకుండానే నాగబాబుకు ఈ చిత్రంతో ఏకంగా 25 కోట్లకు పైగా మిగిలినట్లుగా సమాచారం అందుతుంది.