"చంపడానికైనా...చావడానికైనా నేను సిద్ధం"..! పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.!       2018-05-30   02:06:02  IST  Raghu V

ఒంటరిగా ఉండటం కష్టమనిపిస్తోందని.. తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఇటీవల రేణు దేశాయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె మళ్లీ పెళ్లిచేసుకోవడం అనే విషయాన్ని అసహ్యించుకుంటూ కొందరు అభ్యంతరకర మేసేజ్ లు చేస్తున్నారని రేణు దేశాయ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండో పెళ్లికి సిద్ధమయ్యే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని భావించిన పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేశారు.

-

ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్‌ తన పిల్లల గురించి సోషల్‌మీడియా తరచూ పోస్టింగ్స్‌ చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే సోమవారం కూడా ఆమె ఓ పోస్టు చేశారు. ‘ఒక హృదయం, ఒక ఆత్మ.. మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను, మీ కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను.

-
-

ఓ తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత.. నిర్విరామంగా ఈ క్యూటీల‌ ఫొటోలను తీస్తూనే ఉండగలను’ అంటూ అకీరా, ఆద్యలతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారామె. రేణు దర్శకురాలిగా ‘ఇష్క్‌ వాలా లవ్‌’ సినిమాను తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ సినిమాలో అకీరా కూడా తళుక్కుమని మెరిశాడు.