చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్..అసలేం జరుగుతోంది..?       2018-04-29   22:14:02  IST  Bhanu C

ఫోన్ ట్యాపింగ్ దీని గురించి అందరికి తెలిసిందే ఈ ట్యాపింగ్ విషయంలో హై ప్రొఫైల్ వ్యక్తులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు..ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఈ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది నేటి రాజకీయాల్లో మనం వ్యూహాల కంటే ప్రత్యర్ధి వ్యూహాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం…అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఇప్పుడు మిగిలిన పార్టీలకి అంతుబట్టడం లేదు తిమ్మిని బిమ్మి చేయగల సమర్ధుడు చంద్రబాబు నాయుడు అలాంటిది చివరి నిమిషంలో ప్రజలని తనవైపుకి తిప్పుకోవడానికి తానూ వేసే ఎత్తులకి తలపండిన నేతలు సైతం అవ్వాక్కయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్న వార్త ఏమిటంటే..చంద్రబాబు తో పాటు దేశం లో ఇతర కీలక నేతల ఫోన్లు టాపింగ్ కి గురి అవుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి.

చాలా అధునాతన పరిజ్ఞానం తో ఎప్పటికప్పుడు ట్యాపింగ్ విధానం మారుస్తున్నట్టు సమాచారం…అయితే చంద్రబాబు ఫోన్ ట్యాప్ అవుతున్నట్లుగా ముందే గ్రహించారట చంద్రబాబు ఎలా అంటే తొలి విడత బడ్జెట్ సమావేశాల సమయంలో మూడవ రోజున తమ వ్యూహాలు ముందే తెలిసినట్టు గా కేంద్రం తమని చర్చలకు పిలవటం, తాము ఇంకా అడగని డిమాండ్స్ గురించి కూడా ప్రస్తావించటం చూసి చంద్రబాబు సందేహం వ్యక్తం చేసారట.

అయితే చంద్రబాబు ఈ విషయంలో లోతుగా సమీక్ష కూడా చేశారట..ఇదే విషయాన్ని తన పరిచయాలతో ఇంక్వైర్ చేస్తే నిజమే అని చంద్రబాబు కి సమాచారం వచ్చిందని అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నారని తెలిసింది.గతం లో చంద్రబాబు హాయం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పని చేసిన ఒక వ్యక్తి ప్రస్తుతం కేంద్రంలో అధికారి ఉన్నారని అయితే ఈ విషయాలపై ఒక ఖచ్చితమైన సమాచారం ఆయన ఇచ్చారని టాక్ వినిపిస్తోంది…ఆక్షణం నుంచీ చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటున్నారట.

తెలుగుదేశం పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుని జాతీయ స్థాయి లో ఎక్కడ కొత్త కూటమి ఏర్పాటు చేస్తారో అనే భయం తోనే కేంద్రం ఇదంతా చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు..చంద్రబాబు జాతీయ స్థాయిలోని అన్ని ప్రాంతీయ పార్టీల అగ్ర నేతలతోనూ టచ్‌లో ఉన్నారని, వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారని అందరికి తెలిసిందే. అంతే కాక చంద్రబాబు భావి ప్రధాని అని, త్వరలోనే కొత్త కూటమిని ఏర్పాటు చేస్తారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

కేంద్రంలో మూడు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి చంద్రబాబే కారణం..అలాంటి చంద్రబాబు వ్యుహాలని అందుకోవాలంటే వారి వల్ల కాకపోవడం వలనే..నిఘా వర్గాలు ట్యాపింగ్‌కు పాల్పడి ఉంటాయని టీడీపీ ముఖ్యనేతలు వ్యాఖ్యానిస్తున్నారు..ఏది ఏమైనా సరే పార్టీ లోని ముఖ్యనేతలకి చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారట..పార్టీ విషయాలు ఎక్కాడా కూడా ఓపెన్ గా మాట్లాడవద్దు అని తెలిపారట..