చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీటీడీ ప్రధాన అర్చకుడు..     2018-05-16   00:28:10  IST  Bhanu C

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చంద్రబాబు పై సంచలన ఆరోపణ చేశారు..రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలకు , అశుభాలకి కారణం చంద్రబాబు కారణం అంటూ ధ్వజమెత్తారు..ఎన్నడూ లేని విధంగా పిడుగులు పడి ఎంతో మంది మృత్యువాత పడ్డారు అంటే దానికి కారణం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలే అంటూ ప్రెస్ మీట్ లో తీవ్రమైన విమర్శలు చేశారు..వివరాలలోకి వెళ్తే..

ఆగమన శాస్త్ర విరుద్ధంగా చంద్రబాబు ఎన్నో తప్పులు చేస్తున్నారు…అర్చకుల వారసత్వాన్ని తీసేయాలి అనుకోవడం శాస్త్ర విరుద్ధం అని అన్నారు..స్వామి వారిని తాకే హక్కు అధికారం కేవలం ఆగమన పండితులకు మాత్రమే ఉంటుందని అన్నారు..అయితే మమ్మల్ని స్వామివారికి దూరం చేయాలని అనుకుంటున్నారు భరిస్తూ వస్తున్నాం కానీ ఇప్పుడు భక్తులకు కూడా స్వామిని దూరం చేస్తున్నారు అని మండిపడ్డారు.