గంటా అడుగుతున్నాడు ... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పు జనసేనాని   Ganta Srinivasa Rao Asks Questions To Pawan Kalyan     2018-07-11   01:58:47  IST  Bhanu C

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్ళీ యాక్టీవ్ అయ్యారు. ఆయన ఆ పార్టీలో చేరబోతున్నారు.. ఈ పార్టీలో చేరబోతున్నారు అంటూ ఊహాగానాలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే ఆయన కూడా సైలెంట్ గా రాజకీయాలకు సంభంధం లేదు అన్నట్టుగా ఉండేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు మళ్ళీ గొంతు పెంచారు. జనసేన అధినేత మీద కొద్దీ రోజులుగా మాటల తూటాలు వదులుతున్నారు. పవన్ యాత్రలో ఉత్తరాంధ్ర వెన‌క‌బాటుత‌నం, క‌ళింగ ఉద్యమం, ప‌రిశ్ర‌మ‌లు ఇలా చాలా అంశాల‌పై ప‌వ‌న్ మాట్లాడేసి వెళ్లిపోయారు. అయితే, కొన్ని కీల‌క అంశాల‌పై మాత్రం ఆయ‌న ఎందుకు స్పందించ‌డం లేదంటూ ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ప‌వ‌న్ ను ప్ర‌శ్నించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతున్న‌వి ఆయ‌న సొంత మాటలా, జ‌గ‌న్ ఆలోచ‌న‌లా లేకా బీజేపీ ఆలా మాట్లాడిస్తుందా అంటూ విమ‌ర్శించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని ప‌వ‌న్ క‌ళ్లుండీ చూడ‌లేక‌పోతున్నారు అన్నారు. రాష్ట్రం తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు కూడా రాజ‌కీయాలు చేస్తే చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోతారంటూ మండిప‌డ్డారు.జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ క‌మిటీ ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ. 70 వేల కోట్ల‌కుపైగా ఉన్నాయంటూ నివేదిక ప‌వ‌న్ త‌యారు చేశార‌న్నారు. కానీ, దాంతో కేంద్రాన్ని నిల‌దీసే ధైర్యం ఎందుకు లేక‌పోయింద‌ని ప్ర‌శ్నించారు.

ఏపీకి చెయ్యాల్సిన‌వన్నీ చేశామంటూ సుప్రీం కోర్టులో కేంద్రం త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తే… దానిపై ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌లేద‌న్నారు? కేంద్రంపై అవిశ్వాసం పెడితే, దేశ‌మంతా ప‌ర్య‌టించి మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌న్న ప‌వ‌న్, గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో ఎందుకు మౌనంగా ఉండిపోయార‌న్నారు? కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిచేందుకు టీడీపీ క‌ట్టుబ‌డి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింద‌నీ, దానిపై కేంద్రం స్పందించ‌క‌పోతే ఒత్తిడి తెచ్చేలా ప‌వ‌న్ ఎందుకు మాట్లాడ‌టం లేద‌న్నారు..?

ఉత్త‌రాంధ్ర వెన‌క‌బాటుత‌నంపై ఉద్య‌మిస్తాననే ప‌వ‌న్ క‌ల్యాణ్‌, విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడ‌ర‌ని గంటా ప్ర‌శ్నించారు. వెన‌క‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ. 350 కోట్లు నిధులు వెన‌క్కి తీసుకుంద‌నీ, విశాఖ‌- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు తుది అనుమతు ఇవ్వ‌లేద‌నీ… జ‌గ‌న్ అవినీతి కేసుల్లో ఏడాదిలోగా తీర్పు వెలువ‌డాల్సి ఉన్నా ఎందుకు తుది తీర్పు రావ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నిల‌దీయ‌డం లేదంటూ గంటా ప్రశ్నలు మీద ప్రశ్నలు పవన్ కు మీడియా ద్వారా వేశారు. అయితే గంటా వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తారో లేదో తెలియదు కానీ ఆయనకు మాత్రం ప్రశ్నల బాణాలు గట్టిగానే గుచ్చుకున్నాయి.