ఖమ్మం జిల్లా ఎన్నారై సేవ కి గుర్తింపు..       2018-05-27   23:09:31  IST  Bhanu C

నలుగురికి సేవ చేయడంలో భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు వెనుకాడరు వారు ఎక్కడ ఉన్నా సరే అది తమ సొంత గడ్డ అయినా లేక పరాయి దేశం అయినా సరే తమ సేవా భావాన్ని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటారు..అందులో భాగంగానే ఒక తెలుగు ఎన్నారై చేస్తున్న సేవా కార్యక్రమాలకి గాను అరుదైన గుర్తింపు అందింది.. 2018 సంవత్సరానికి గాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (FIA) ఉత్తమ సామాజిక సేవా పురస్కారాన్ని ప్రదానం చేసింది..వివరాలలోకి వెళ్తే..

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవాస తెలుగు ప్రముఖుడు సామినేని రవికి 2018 సంవత్సరానికి గాను “FIA” ఉత్తమ సామాజిక సేవా పురస్కారాన్ని ప్రదానం చేసింది…ఈ కార్యక్రమం స్థానకంగా ఉన్న కొలంబస్ బ్రిడ్జి వాటర్ హాల్‌లో జరిగింది..అయితే ఈ అవార్డు బహుకరణ వేడుకలో అమెరికాలోని భారత రాయబారి నవ్‌తేజ్‌ సింగ్‌ విచ్చేసారు..ఆయన చేతులు మీదుగా అవార్డు ప్రధానం చేశారు..

సామినేని చేసిన సేవా కృషి ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఛైర్మన్‌ నీల్ పటేల్ కొనియాడారు అమెరికాలో కన్నుమూసిన ఎంతో మంది ప్రవాస భారతీయుల మృతదేహాలను తానా టీం స్క్వేర్ సంస్థ ద్వారా స్వదేశానికి చేర్చడం..బోన్ మారో లపై అవగాహన కార్యక్రమాలు పేద అనాథ పిల్లల చదువు నిమిత్తం విరాళాల సేకరణ, భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆపరేషన్ క్యాంపు నిర్వహణ ఇలా ఎన్నో కార్యక్రమాలని సామినేని చేశారు..ఆయన చేసిన ఎన్నో సేవాకార్యక్రమాలకి గుర్తింపుగా ఈ అవార్డు బహుకరణ ఇస్తున్నారని తెలిపారు..