క‌న్నుల పండువ‌గా శోభాయాత్ర‌...ప‌ల్లకి మోసిన సీఎం కేసీఆర్

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్టపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి.

 Cm Kcr Carrying The Procession To The Pillars As A Festival Of The Eyes-TeluguStop.com

బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్,ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు, ప్ర‌భుత్వ అధికారులు,అర్చ‌కులు,వేదపండితులు పాల్గొన్నారు.శోభాయాత్ర‌లో భాగంగా బంగారు క‌వ‌మూర్తులు,ఉత్స‌వ విగ్ర‌హాలు,అళ్వార్లు ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు,క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.

వేద మంత్రోచ్ఛ‌ర‌ణాలు,మేళ‌తాళాల మ‌ధ్య శోభాయాత్ర వైభ‌వంగా కొన‌సాగుతోంది.సీఎం దంపతులు ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.

ప్రధానాలయ పంచతల రాజగోపుర‌రం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube