క్రిష్‌ ఒప్పుకోవడానికి కారణం ఇదా?  

తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట దర్శకుడు తేజను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు క్రిష్‌కు అప్పగించడం జరిగింది...

క్రిష్‌ ఒప్పుకోవడానికి కారణం ఇదా?-

సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య సాదా సీదా దర్శకుడితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే పెద్దగా అంచనాలు ఉండవని, అలాగే సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించలేక పోవచ్చు అనే ఉద్దేశ్యంతో బాలయ్య స్టార్‌ డైరెక్టర్‌ కోసం ప్రయత్నాలు చేశాడు.

‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం నిర్మాణ వ్యయంలో దాదాపు 70 శాతంకు పైగా బాలయ్య ఖర్చు చేస్తున్నాడు. ఈ చిత్రంను పూర్తిగా బాలయ్య నిర్మించాలని భావించినా కూడా సినిమాలో నటుడిగా ఎక్కువ పాత్రలు చేయడంతో పాటు, ఇంకా కీలక విధులు నిర్వహించాల్సి ఉందని, అందుకే నిర్మాణ బాధ్యతలను సాయి కొర్రపాటికి కూడా అప్పగించడం జరిగింది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

ఇలాంటి సినిమాను చేయాలంటే దర్శకులు కాస్త వెనుకాడుతారు. కాని దర్శకుడు క్రిష్‌ మాత్రం ఎక్కువ పారితోషికం ఆఫర్‌ చేయడంతో ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
క్రిష్‌ తన ప్రతి సినిమాకు కూడా నిర్మాణ భాగస్వామి అవుతూ ఉన్నాడు..

తాజాగా ఈ చిత్రానికి కూడా భాగస్వామి అవుతున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ షేర్‌ ఆఫర్‌ చేయడం వల్లే దర్శకుడు క్రిష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొన్ని ఏరియాల రైట్స్‌కు చాలా డిమాండ్‌ ఉంటుంది.

అందుకే ఈ చిత్రం ఒక ఏరియా రైట్స్‌ పూర్తిగా క్రిష్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో క్రిష్‌కు దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు పారితోషికంగా దక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాడు.

గౌతమిపుత్ర శాతకర్ణితో తనకు సక్సెస్‌ను ఇచ్చిన క్రిష్‌ మరోసారి ఈ చిత్రంతో సక్సెస్‌ను ఇస్తాడని బాలయ్య భావిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

త్వరలోనే నటీనటుల ఎంపికకు క్రిష్‌ సన్నాహాలు చేయబోతున్నాడు.