కొన్ని గంట‌ల్లో చ‌నిపోతాన‌ని తెలిసిన న‌ర్స్…! తన భర్తకు రాసిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లే.!       2018-05-22   23:09:52  IST  Raghu V

రోగుల‌కు చికిత్స చేస్తుండ‌గా…నిఫా వైర‌స్ నాకూ సోకింది. నాకు తెలుసు ఈ వైర‌స్ కు మందు లేద‌ని.! నేను కొన్ని గంట‌ల్లో చ‌నిపోతాన‌ని నాకు తెలుసు, చివ‌రి సారిగా మిమ్మ‌ల్ని, పిల్ల‌ల్ని కూడా చూడ‌లేన‌ని కూడా నాకు తెలుసు ఇదే నా గుండెల్ని మ‌రింతగా పిండేస్తుంది. పిల్ల‌ల్ని జాగ్ర‌త్తగా చూసుకో…వారిని గ‌ల్ఫ్ తీసుకెళ్ళు, వారిని బాగా పెంచు, నేను లేన‌ని నీవు జీవితాంతం ఒంట‌రిగా ఉండ‌కు, మా నాన్న‌లా నీ జీవితాన్ని ఒంట‌రి చేసుకోకు…. జాగ్ర‌త్త‌గా ఉండూ..దేవుడు నాకే ఇలా ఎందుకు చేశాడో అర్థ‌మ‌వ్వ‌ట్లేదు.! బై.! నా కాలం చెల్లింది.! పిల్ల‌లు జాగ్ర‌త్త‌.!! ఇది మ‌రికొద్దిసేప‌ట్లో చ‌నిపోతాన‌ని తెలిసిన ఓ న‌ర్స్ త‌న భ‌ర్త‌కు రాసిన లెట‌ర్.!

-

లినీ మరణంపై స్పందించిన డాక్టర్‌ దీపూ సెబిన్‌ దేశ ప్రజల రక్షణలో భాగస్వామ్యమై ప్రాణాలు వదిలిన లినీ వీర మరణం పొందారని, ఆమె అమరవీరురాలు కాకపోతే మరెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కాగా, నిపా వైరస్‌ సోకి పలువురు కేరళలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు నర్సులు ఉన్నారు.

ఈ వైర‌స్ సోకిన లినీ ఆ హాస్పిట‌ల్ లోనే చ‌నిపోయింది. కుటుంబ స‌భ్యులు చివ‌రి చూపు చూడ‌క‌ముందే లినీ డెడ్ బాడీని నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఖ‌న‌నం చేశారు. చివ‌రి చూపుకు అవ‌కాశ‌మిస్తే…మిగితా వారికి కూడా ఈ వైర‌స్ సోకే ప్ర‌మాద‌ముంద‌ని తెలిసి డాక్ట‌ర్లు ఇలా చేశారు .

-

కేర‌ళ‌లో నిఫా వైర‌స్ క‌ల‌క‌లాన్ని సృష్టిస్తుంది ఇప్ప‌టికే 10 మంది ఈ వైర‌స్ కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు. ఇది అరుదైన వైరస్‌. గబ్బిలాలు, పందులు, ఇతర జంతువులతో ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్‌ కూడా లేనట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటు పడిపోవడం, బలహీనత ఈ వ్యాధి లక్షణాలు.

గబ్బిలాలు, పందుల ద్వారా ఎక్కువగా నిపా వైరస్‌ సోకుతుంది. గబ్బిలాలు తీసుకున్న ఆహారం ద్వారా ఇది సోకుతుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయల ద్వారా ఇది సోకే ప్రమాదం ఎక్కువ. పందులు, పిల్లి, కోతులు తదితరాల ద్వారా కూడా ఇది మనుషులకు సోకుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం
2. పండ్లు, కూరగాయలను పరిశుభ్ర పరిచిన తర్వాతే తీసుకోవడం
3. చేతులను ప్రతిసారీ సబ్బతో కడుక్కోవడం
4. మామిడిపండ్లు, జాక్‌ ఫ్రూట్స్‌, రోజ్‌ ఆపిల్స్‌లను గబ్బిలాలు ఆహారంగా ఎక్కువ తీసుకుంటాయి. వీటిని వినియోగించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.