కెంపు ఆడవారికి మంచిదా...మగవారికి మంచిదా?  

  • కెంపులను ఇంగ్లిష్ లో రూబీ అని అంటారు. సంస్కృతంలో మాణిక్యం అని అంటారు. మన అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. పుట్టిన ప్రతి ఒక్కరు రోజు రోజుకి అభివృద్ధి అనేది జరగాలి. వారి అభివృద్ధిని చూసి తల్లితండ్రులు చాలా సంతోషపడతారు. ఈ అభివృద్ధిని చూసి ఈర్ష్య పడేవారు ఉంటారు. ఈ ఈర్ష్య ద్వేషాల ప్రభావం పడకుండా ఉండాలంటే కెంపు జాతి రత్నాన్ని ధరించాలి.

  • -

  • ఎరుపు వర్ణం జాతి రత్నం ధరించటం వలన నారా దిష్టి తగ్గుతుంది. ఇలా ధరించటం వలన వారి అభివృదిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండి ఉన్నతస్థితికి చేరుకుంటారు. అలాగే వీరు చేసే ఏ పని అయినా తెలివితేటలతో చేస్తారు. అలాగే కెంపుని ధరించటం వలన ప్రజా బలం పెరుగుతుంది. వారు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది.

  • చర్మ వ్యాధులు,జన్యు పరంగా వచ్చే రక్త దోషాలు తగ్గుతాయి. కెంపు రత్నం ధరించటం వలన ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. శరీరంలో వేడి ఉన్నా, కళ్ళు వేడిగా ఉన్నా,కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు కెంపు జాతి రత్నాన్ని ధరిస్తే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా కళ్ళ మంటలు కూడా తగ్గిపోతాయి.

  • కెంపులను రాత్రి సమయంలో నీటిలో వేసి ఆ నీటిని మరుసటి రోజు త్రాగితే రక్త దోషాలు నశిస్తాయి. కెంపు ధరించటం అనేది పురుషులకు మంచిదా శస్త్రీలకు మంచిదా అనే ఆలోచిస్తే పురుషులకు మంచిదని జ్యోతిష్య నిపుణులు చెప్పుతున్నారు.