కూతురితో ఆ టాప్ హీరో ఎలా ఫోటో దిగాడో చూడండి.! మండిపడుతున్న నెటిజెన్స్.!  

  • బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరొందిన ఆమిర్‌ఖాన్ వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయ్నతిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆమిర్‌ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమిర్‌ఖాన్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తన కుమార్తెతో కలసివున్న ఫొటోను షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు అసభ్యకరంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమిర్ తన కుమార్తె ఇరాఖాన్‌తో స్పోర్ట్స్ మూడ్‌లో ఉన్న ఒక ఫొటో షేర్ చేశారు. దానిలో వారిద్దరూ ఏదో పార్కులో ఆడుతూ కనిపిస్తున్నారు.

  • -

  • అయితే కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఫొటోపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక ముస్లిం సోదరుడు కామెంట్ చేస్తూ ‘పవిత్ర రంజాన్ మాసంలో ఆమిర్ ఇటువంటి ఫొటో షేర్ చేయకుండా ఉండాల్సింది’ అని పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆమిర్ సార్… ఒకసారి రంజాన్ గుర్తుకు తెచ్చుకోండి. ఆమె మీ కుమార్తె రంజాన్ సందర్భంలోనైనా మంచి దుస్తులు ధరించాలి’ అని సూచించాడు. మరో యూజర్ ‘ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తోంది. ముస్లిం అయివుండి కాస్తయినా సిగ్గుపడండి’ అని కామెంట్ చేశాడు.

  • -

  • -
  • కాగా త్రిభువన్ నారాయణ్ అనే మరో యూజర్ ఈ ఫొటోపై విభిన్నంగా స్పందించారు. ‘ఇది తండ్రీ కుమార్తెల ప్రేమకు చిహ్నం. ఇది కూడా జనాలకు సమస్యగా మారింది. ఒక తండ్రి ఎదుగుతున్న తన పిల్లలతో ఆడుకోకూడడా? ఈ ఫొటోలో కుమార్తెకు బదులు కొడుకు ఉంటే ఇలా అనేవారా? రంజాన్ మాసంలో తండ్రి తన పిల్లలను ప్రేమించకూడదనే నిషేధం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.