కాలేజీలో దారుణం: ఫెస్ట్ ఖర్చుల గురించి అడిగితె..నగ్నంగా చేసి వీడియో తీశారు.! చివరికి ఏమైందంటే?       2018-06-04   00:55:21  IST  Raghu V

యూనియన్ నిర్వహించే ఫెస్ట్‌ ఖర్చుల గురించి ఆరా తీయడంతో.. అతడిని బలవంతంగా దుస్తులు తొలగించి, సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ సంఘటన కోల్కత్తాలో చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్ధి విభాగానికి చెందిన ఓ సభ్యుడిని అదే యూనియన్‌కి చెందిన సీనియర్లు దారుణంగా అవమానించారు.

గత నెల 17న కోల్‌కతాలోని సెయింట్ పాల్స్ కెథడ్రల్ కాలేజిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకడు దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. అందరి ముందు దుస్తులు విప్పేయాలని వేధించడంతో తనను వదిలేయాలని వేడుకుంటున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. అతడిని తీవ్రంగా కొట్టడంతో పాటు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ సీనియర్ విద్యార్ధులు బెదిరించారు.

-

ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ సీరియస్ అయ్యారు. బాధిత విద్యార్థి నుంచి రాతపూర్వక ఫిర్యాదు తీసుకున్న ఆయన.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత విద్యార్ధి తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ) కాలేజీ విభాగం సభ్యుడుగా చెబుతున్నారు. కాలేజిలో నిర్వహించనున్న ఫెస్ట్ గురించి తాను ఆరా తీయడంతో యూనియన్‌కి చెందిన సీనియర్ విద్యార్ధులు తనను చిత్రహింసలు పెట్టారని అతడు ఆరోపించాడు.