కాబోయే భార్యను నగ్న (న్యూడ్) ఫోటో పంపమన్నాడు.! అదే అతని కొంపముంచింది.! అసలేమైంది?       2018-06-02   23:49:52  IST  Raghu V

మనదేశంలో నూటికి 80శాతం పెళ్లిళ్లు సంప్రదాయబద్దంగానే జరుగుతాయి. అబ్బాయి, అమ్మాయిలకు యుక్తవయస్సు రాగానే పెళ్లి సంబంధాలు చూస్తారు.. పెద్దలు నిర్ణయించిన వివాహాల కన్నా ప్రేమ పెళ్లిళ్లలో ఎక్కువ స్వేచ్చ ఉంటుందని మహిళలు భావిస్తారు. తమకు నచ్చినవాడితో మనువు తమకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందనుకుంటారు. అన్నింటికీ మించి పెళ్లి తమ ఇష్టానికి అనుకూలంగా జరిగిందన్న ఆనందం వారికి మరింత ఉపశమనాన్నిస్తుంది.

కానీ ఆ పెళ్లి పీటలెక్కక ముందే ఆగిపోయింది. సాధారణంగా కట్నం కోసం పెళ్లి రద్దవ్వడం వినే ఉంటాము. కానీ ఈ పెళ్లి ఆగిపోయింది అందుకు కాదు. పెళ్లి కొడుకు కోరిన ఓ వింత కోరిక వల్ల. అసలేమైంది అనుకుంటున్నారా.? వివరాలు మీరే చూడండి.

-

మహారాష్ట్ర కు చెందిన జితేంద్ర రాధాకృష్ణ కు ఓ అమ్మాయి తో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఎంగేజ్మెంట్ తర్వాత తనకు కాబోయే భార్య తో… చాటింగ్ చేస్తూ , ఫోన్ లో మాట్లాడుతూ గడిపాడు జితేంద్ర. చివరకు ఓ రాత్రి చాట్ చేస్తూ ..చాట్ చేస్టూ .. న్యూడ్ సెల్పీ కావాలని అమ్మాయిని అడిగాడు. అదే పనిగా వేధించడం స్టార్ట్ చేశాడు. పంపుతావా లేదా నేను నిన్ను కట్టుకోబోయే వాడినే అంటూ బ్లాక్ మెయిలింగ్ కూడా చేశాడు.

-

వరుడి వింత ప్రవర్తన చూసి ఆ అమ్మాయి తన తల్లీదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తరఫు వాళ్లు ఏకంగా ఆ పెళ్లినే కాన్సల్ చేసుకున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు . దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్ర ను అరెస్ట్ చేశారు. అంతకు ముందే అబ్బాయికి కట్నం కింద 3 లక్షలను కూడా ఇచ్చారు. టెక్నాలజీ పెరిగిందనేది వాస్తవమే, కానీ టెక్నాలజీని వాడుకునే విధానం మాత్రం ఇది కాదు. కుర్రాళ్లు కాస్త జాగ్రత్త..