కలెక్టరేట్ ముట్టడికి తరలివెళ్లిన జర్నలిస్టులు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,ఇల్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా పూర్తిగా విఫలమైందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టిడబ్ల్యూజెఎఫ్)( Telangana Working Journalist Federation ) నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మూల శేఖర్ రెడ్టి,నామలింగయ్య విమర్శించారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాకు సాగర్ నుండి తరలి వెళుతూ మాట్లాడారు.

 Journalists Protest Infront Of Collectorate,telangana Working Journalist Federat-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయలేదని,దీనివల్ల అనేక మంది పేద జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,ఇండ్లు మంజూరు చేయాలన్నారు.

ప్రస్తుతం జర్నలిస్టులకు ఇస్తున్న బస్ పాస్ కూడా పూర్తి స్థాయిలో వర్తించడం లేదని,రైల్వే పాక్,బస్ పాస్,వంద శాతం రాయితీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని,జర్నలిస్టులకు జర్నలిస్ట్ బంధు పథకం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు, రమణ,ఇబ్రహీం,సైదులు,సతీష్,రవిశంకర్, వెంకటసుబ్బయ్య, సూరయ్య,రవి,శ్రీధర్ రెడ్టి, యడవెల్లి శంకర్,హరి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube