కఫాన్ని కరిగించే..తులసి మిరియాలు  

మన ఇంట్లో వంటగదిలో ఉండే పదార్ధాలతో అనేక రకాల రోగాలు రాకుండా లేదా వచ్చిన వాటికి రోగాలని తగ్గించుకోడానికి చిన్న చిన్న చిట్కాలతో పరిష్కరించుకోవచ్చు.సాధారణంగా మిరియాలని చాలా మంది తినడానికి ఇష్టపడరు.

కారణం అవి చాలా ఘాటుగా ఉంటాయి.కానీ అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కఫాన్ని కరిగించే..తులసి మిరియాలు-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అలాగే నిత్యం మనం పూజించే తులసి ఆకులు కూడా మన ఆరోగ్య సంరక్షణలో చాలా బాగా ఉపయోగపడుతాయి.ఆరోగ్య పరిరక్షణలో మిరియాలు, తులసి ఆకుల్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం

కఫం మనలో చాలా మంది ఈ సమస్యతో భాదపడుతుంటాడు.

అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు కానీ చారులో మిరియాల పొడి వేసి, దానిలో నెయ్యి తో పోపు పెట్టి.భోజనం చేస్తే కఫం తగ్గుతుంది.

అలాగే జలుబు ఉన్న వాళ్ళు ప్రతీ రోజు ఉదయం కొన్ని తులసి ఆకుల్ని తీసుకుని వాటిని దంచి కషాయంగా కాచాలి,ఆ కషాయంలో ఒక స్పూన్ తేనే కలిపి తాగితే జలుబు తగ్గుతుంది

మిరియాల పొడి,బెల్లంపెరుగు కలిపిన మిశ్రమాన్ని పడుకునే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది.పసుపు కొమ్ముల్ని కాల్చి దాని పొగని పీల్చినా ,లేక ఆరువేల్లుల్లి గ్రాముల రసం బెల్లంతో కలిపి తిన్నాసరే .ఉసిరిపొడి ,శొంటి ,పిప్పల్లి ,మిరియాల పొడి,వీటన్నింటినీ కలిపి రొజూ తీసుకుంటే కఫం తగ్గుతుంది.ఈ చిట్కాని జబ్బు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు…ఇలా తీసుకోవడం వలన ముందుగానే ఇటువంటి సమస్యలని రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు