కన్న కూతురుపై అత్యాచారం చేసిన ఆ కీచక తండ్రికి శిక్ష ఏంటో తెలుసా       2018-06-23   01:20:20  IST  Raghu V

కన్న కూతురుపై అత్యాచారం చేసిన ఓ రాక్షస తండ్రికి కోర్టు జీవిత ఖైదు విధించింది..వాయి వరసలు మరిచిపోయి ఏకంగా కన్నా కూతిరిపైనే అత్యాచారం చేసిన ఆ దుర్మార్గపు తండ్రికి కోర్టు విధించిన శిక్షతో అతడి భార్య కోర్టుకి కృతజ్ఞతలు తెలిపింది..ఈ ఘటన ఎక్కడో జరగలేదు హైదరాబాద్ లోనే జరిగింది..ఈ ఘటన జరిగిన రెడేళ్ళ తరువాత కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది..వివరాలలోకి వెళ్తే….

తాడ్‌బన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 46 ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు…ప్రతీ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యా కూతురిని హింసించే వాడు వారిని నిత్యం కొడుతూ ఉండేవాడు..అయితే ఈ భాధలు భరించలేని ఆమె మూడేళ్ల క్రితం విడాకులు తీసుకుంది..ఈ మధ్యలో ఆమె తన 12అ ఏళ్ల కూతురుతో వేరేగా ఉంటోంది..అయితే ఈ క్రమంలో ఆమె భర్త ఒక రోజు అంటే 2016 సెప్టెంబర్‌ 24వ తేదీ అర్ధరాత్రి మద్యం మత్తులో ఆమె వద్దకు వెళ్లి గొడవపడి గదిలో బంధించి కూతురిపై అత్యాచారం చేశాడు.

ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందినా ఆమె తన కూతురికి జరిగిన అన్యాయంపై మరుసటి రోజు పోలీసులకి ఫిర్యాదు చేసింది..దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి సునీత నిందితుడికి జీవిత ఖైదు విధించారు…దాంతోపాటు 2 వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు..