కంప్యూటర్స్ వలన వచ్చే జబ్బులు –పరిష్కారాలు  

మనిషి శరీరంలో కాలు, చెయ్యి ఎలా భాగం అయ్యయో ఇప్పుడు కంప్యూటర్స్ కూడా అలానే అయ్యాయి.మనిషికి వీటి వలన శ్రమ తగ్గి పని తొందరగా అయిపోవడంతో మనిషి ఒకరకంగా వీటికి బానిస అయ్యాడనే చెప్పాలి.అయిత ఇప్పుడు చాలా మంది కంప్యూటర్స్ ముందే కూర్చుని ఎక్కువ సేపు పనిచేయడం వలన అనేక రకాలైన సమస్యలతో భాదపడుతున్నారు...

-

ఆ సమస్యలని అధిగమించడం ఎలా అనేది చూద్దాం. కంప్యూటర్స్ ని అతిగా వాడడం వలన దాని ప్రభావము మన ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది .

రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులు ,ఉబకాయం సమస్యలతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది.

ఈ జబ్బులు ఒక్క వయసు మళ్ళిన వారికే కాదు యవ్వనస్తులు కూడా ఈ సమస్యలతో భాదపడుతున్నారట. ఈ సమస్యలని అధిగమించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని సక్రమంగా పాటిస్తే సరిపోతుంది.కంప్యూటర్స్ ముందు ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు కనీసం గంటకి ఒక్కసారి అయినా సరే లేచి అటు ఇటు తిరుగుత ఉండాలట.

రేడియేషన్ తక్కువగా ఉండే మోనిటర్స్‌ను వాడటం మంచిది ఇది కంటిపై రేడియేషన్ ప్రభావం ఇది తగ్గిస్తుంది.చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి – కంప్యూటర్స్ ముందు ఉన్నప్పుడు కంటి రెప్పలని ఎక్కువ సార్లు మూయడం తెరవడం చేయాలి. కంటికి స్క్రీన్ కి మధ్యన దూరం 55నుంచి 75సెం.మీ.

వరకు వుండాలి దీనివలన కంటిలోపలి భాగాలు దెబ్బతినకుండా ఉంటాయి. .కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు.

దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి.కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి.

అంతేకాదు కళ్ళకి సరైన ఎత్తులో మానిటర్ ఉండాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే కంప్యూటర్స్ నుంచీ వచ్చే వ్యాధులని నివారించవచ్చు.