ఓ వ్యక్తిని మోసం చేసి కోర్టుకి ఎక్కిన విజయశాంతి       2017-09-19   00:47:02  IST  Raghu V

ఇప్పటితరం హీరోయిన్లు కోటి కోటిన్నర తీసుకుంటూ దాన్నే మార్కేట్, స్టార్ డమ్ అనుకుంటున్నారు కాని, 1990 ల్లోనే కోటి రూపాయల పారితోషికం అందుకున్న నటి విజయశాంతి. యావత్ భారతదేశంలో అదో రికార్డు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్న అరుదైన నటి విజయశాంతి. మరి ఊరికే ఆమెని లేడి సూపర్ స్టార్ అనేవారా ఏంటి?

సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ లేడి అమితాబ్, ఇక్కడ మాత్రం సినిమాల్లో లాగా రాణించకేకపోయారు. ఏ స్పీడుతోనైతే తెలంగాణ రాష్ట్ర సమితి లోకి వచ్చి ఓ వెలుగు వెలగాలనుకున్నారో, కేసిఅర్ తో తగవు పెట్టుకోని అదే స్పీడులో పార్టీ నుంచి బయటకి వెళ్ళిపోయారు‌. ఆ కాంగ్రెస్ లో చేరి ఎన్నికల్లో ఓడిపొయిన విజయశాంతి, అప్పటినుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే, రాజకీయాల్లోకి వచ్చాక ఖర్చులకోసం 2006 లో విజయశాంతి తన స్థిరాస్తులు కొన్ని అమ్మేసుకున్నారని సమాచారం. 5 కోట్లకు పైగా చెల్లించి ఇందర్ చందర్ అనే వ్యక్తి ఆమె ఆస్తులను కొనుగోలు చేయగా, విజయశాంతి ఆ ఆస్తులని తిరిగి మరోవ్యక్తికి విక్రయించారని ఇందర్ చందర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట ఓ జిల్లా కోర్టు ఆయన పిటిషన్ ని కొట్టివేసినా, ఆ తరువాత మైద్రాస్ హైకోర్టుకి వెళ్ళడంతో ఫలితం దక్కింది.

నిన్న కూడా విచారణ జరిపిన కోర్టు, సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అడుగులు వేస్తోంది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని పక్కనపెడితే, అన్యాయాన్ని ఎదుర్కొనే పోలీస్ పాత్రల్లో కనిపించి స్టార్ డమ్ సంపాదించిన విజయశాంతి ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఆమె అభిమానులకు మింగుడుపడని విషయమే.

,