ఓ జంట సరదాగా చేయించుకున్న డీఎన్‌ఏ టెస్టు జీవితాన్ని నాశనం చేసింది.. ఎలాగో తెలిస్తే అవాక్కవుతారు  

A Couple Had Done Dna Test For A Time Pass-dna Test,general Telugu Updates,husband,murderer,reports,ఓ జంట సరదాగా

అభివృద్ది చెందిన దేశాల్లో చాలా కాలంగా డీఎన్‌ఏ భద్రపర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి అందుకు సంబంధించిన హిస్టరీని తయారు చేసి పెడతారు. ముఖ్యంగా నేరస్తులకు సంబంధించిన డీఎన్‌ఏ శాంపిల్స్‌ను సేకరించి వాటి రిపోర్ట్‌ను ఇంటర్నెట్‌లో భద్రపర్చుతారు..

ఓ జంట సరదాగా చేయించుకున్న డీఎన్‌ఏ టెస్టు జీవితాన్ని నాశనం చేసింది.. ఎలాగో తెలిస్తే అవాక్కవుతారు-A Couple Had Done DNA Test For A Time Pass

నేరస్తుల డీఎన్‌ఏతో ఎప్పుడైనా, ఏదైనా మ్యాచ్‌ అయితే నేర నిర్థారణలో చాలా సులువుగా గుర్తించవచ్చు. అందుకే నేరస్తుల డీఎన్‌ఏ రిపోర్ట్‌ను భద్రపర్చడం జరిగింది. దాదాపు వంద ఏళ్లుగా అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఈ విధానం కొనసాగుతుంది.

ఒక జంట తమ డీఎన్‌ఏ ఎలా ఉందని తెలుసుకునేందుకు సరదాగా పరీక్ష చేయించుకున్నారు. అయితే వారు ఊహించని ట్విస్ట్‌ ఏదురైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…బ్రిటన్‌కు చెందిన ఒక జంట సరదాగా తమ డీఎన్‌ఏ గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయించుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్న తర్వాత వచ్చిన రిపోర్ట్‌తో వారి మతి పోయినంత పని అయ్యింది.

జంటలో భర్తకు చెందిన పూర్తికుల్లో ఒక వ్యక్తి నరరూప రాక్షసుడి మాదిరిగా ఎన్నో హత్యలు చేశాడు. భర్త డీఎన్‌ఏతో కొన్ని డీఎన్‌ఏలు పోలి ఉండటంతో వారి చరిత్ర తెలుసుకున్న భార్య ఆ హంతకుడి గురించి తెలుసుకుని అవాక్కయ్యింది.

తన భర్త రక్త సంబంధీకుల్లో ఒక వ్యక్తి హంతకుడు అవ్వడం వల్ల ఇతడు కూడా ఇప్పుడు కాకుంటే తర్వాత అయినా ఏదో ఒక సమయంలో హంతకుడిగా మారే అవకాశం ఉందని, ఇలాంటి వ్యక్తితో నేను బతకలేను అంటూ చెప్పింది. భయంతో బతకడం తన వల్ల కాదని, అతడి నుండి విడిపోతాను అంటూ కోర్టులో విడాకులకు దరకాస్తు చేసింది.

ఆమెకు భర్త ఎంతగా నచ్చ జెప్పేందుకు ప్రయత్నించినా కూడా వినడం లేదు.