ఒకప్పుడు హోటల్ లో సర్వర్ ఇప్పుడు జబర్దస్త్ టీం లీడర్ , ఎవరో చూడండి..       2018-06-08   00:39:08  IST  Raghu V

జబర్దస్త్ తెలుగు లో నెంబర్ వన్ కామెడీ షో , జబర్దస్త్ షో అందరికి నవ్వులు పంచడమే కాదు ఎందరో ఆర్టిస్ట్ లకి అవకాశాలు ఇచ్చి వారిని పాపులర్ చేసింది.చాలా మంది మారుమూల గ్రామీణ ప్రాంతాలలో నుండి వచ్చి జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్నారు. జబర్దస్త్ లో గుర్తింపు తో సినిమా అవకాశాలు కూడా దక్కిచుకున్న జబర్దస్త్ నటులు చాలానే ఉన్నారు.జబర్దస్త్ షో లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆర్టిస్ట్ రాచకొండ ప్రసాద్ (కిర్రాక్ ఆర్పీ), తన విలక్షణ హావభావాలతో కామెడీ చేయగల ఆర్టిస్ట్, కానీ ఇతను ఒకప్పుడు సర్వర్ గా పనిచేశాడు. ఇప్పుడు టీవీ లో కనిపిస్తున్న ఆర్పీ , ఒకప్పుడు హోటల్ లో సర్వర్ గా చేశారు , అసలు సర్వర్ నుండి జబర్దస్త్ షో కి రావడం కోసం చాలా కష్టపడ్డాడు.

-

ఛాన్స్ ఇస్తానన్నా శ్రీహరి..లైఫ్ టర్న్ చేసిన జబర్దస్త్:


నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సంగుటూరు కి చెందిన ఆర్పీ బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాడు.అమ్మ రాటకొండ పద్మ, నాన్న రాటకొండ వెంకటాద్రి. వ్యవసాయ కుటుంబం. చదువు కోసం సెలవుల్లో కూలిపనికి కూడా వెళ్లేవాడట ఆర్ పి.స్పాంటేనియస్ గా జోకులు వేసి ఫ్రెండ్స్ ని నవ్వించడం చిన్నప్పటి నుంచే అలవాటు..దాంతో పాటు సినిమాలంటే పిచ్చి…ఇంట్లో కూర్చుంటే సినిమా ఛాన్సులు దక్కవని అంతా సర్దుకుని హైదరాబాదు వచ్చేసి హోటల్‌లో సప్లయిర్‌గా చేరిపోయాడు.ఇంట్లో చెప్పాపెట్టకుండా వచ్చాడని ఇంటి నుండి డబ్బులు పంపించేవారు కాదు.క్యాటరింగ్ బాయ్ గా కూడా చేశాడు..ఏ పని చేస్తున్నా పూట గడుస్తున్నప్పటికి సినిమాలపై మక్కువ తగ్గకపోవడంతో ఒక షార్ట్ ఫిలిం తీసాడు ఆర్పి..దానికి శ్రీహరి ప్రశంసలు దక్కి సినిమాల్లో ఛాన్సు ఇస్తా అని మాట ఇచ్చినప్పటికీ..మాట నిలబెట్టుకునే లోపు శ్రీహరి కన్నుమూసారు..ఇంతలో స్క్రిప్ట్ రైటర్ గా ధనరాజ్ ఆర్పీని తీసుకున్నారు..అక్కడే ఆర్పీ లైఫ్ టర్న్ అయింది..

సర్వర్ నుండి జబర్దస్త్ ఫేమ్ గా :


ఒకప్పుడు అన్నపూర్ణ హోటల్ లో సర్వర్ గా పనిచేస్తూ పూట గడవడమే కష్టంగా ఉన్న సమయం లో అతను తీసిన షార్ట్ ఫిల్మ్ కి మంచి స్పందన వచ్చింది, చాలా మంది ఆయనను అభినందించారు అందులో శ్రీ హరి గారు ఒకరు. జబర్దస్త్ ధనరాజ్ తన టీం లో ఆర్పీ కి అవకాశం ఇచ్చాడు. దానితో మెల్లి మెల్లిగా తన కామెడీ తో పెరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు టీం లీడర్ కూడా అయ్యాడు. జబర్దస్త్ షో లో ఆర్పీ కామెడీ చూసి కొన్ని సినిమాల్లో కూడా ఆర్పీ కి బాగానే అవకాశాలు వస్తున్నాయి.