ఒకప్పుడు "పవన్ కళ్యాణ్" సరసన నటించిన ఈ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా?       2018-05-25   00:55:36  IST  Raghu V

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా గుర్తుందా.? ఆ సినిమా హీరోయిన్ సుప్రియా చరణ్ రెడ్డి తెలుసా.? అక్కినేని నాగేశ్వరావు పెద్ద కూతురు యార్లగడ్డ సత్యవతి కూతురు. సుమంత్ కి అక్క. అంటే నాగార్జునకి స్వయానా మేనకోడలు. తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు పెద్ద నిర్మాత.

-
-


సుప్రియ తల్లిదండ్రులిద్దరూ మరణించారు. ఆ తర్వాత ఆమె అక్కినేని నాగే్శ్వరరావు సంరక్షణలోనే పెరిగింది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఆమెను హీరోయిన్ గా ఎలివేట్ చేయాలని అనుకున్నారు కానీ ఆమె హీరోయిన్ గా అంత సక్సెస్ అవ్వలేదు. హీరోయిన్ గా నటించిన కొంత కాలానికి ఆమె చరణ్ అనే ఒక హీరోని ప్రేమించి పెళ్లిచేసుకుంది. శ్రీయా మొదటి సినిమా ఇష్టంలో హీరో అతడు. సుశాంత్ డెబ్యూ మూవీ కాళిదాస్ కు అతడే దర్శకుడు.

-
-

భర్త దర్శకుడిగా తనను తాను నిరూపించుకొనే ప్రయత్నంలో ఉండగా.. సుప్రియా అన్నపూర్ణ స్డూడియోస్ వ్యవహారాలు చూసుకునేది. ఆ స్టూడియోకి ఆమే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . తన వ్యాపార దక్షతతో స్టూడియోకు ఓ కార్పొరెట్ లుక్కును తెచ్చేశారు. కానీ స్టూడియోలో కొందరిపై చిన్నాపెద్దా తేడా లేకుండా మాట్లాడేస్తుంటారనే విమర్శలు వస్తున్నాయి. అయితే తన ఉద్యోగంలో భాగంగానే ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆమెను దగ్గరనుంచి చూసినవారికి తెలిసిన సత్యం. పని విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే ఆమె మాటలను భరించలేని కొందరు తమతమ చిత్రం షూటింగులను రామోజీ ఫిలిం సిటీకి మార్చేసుకుంటున్నారట.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.