ఏపీ ఆర్థిక మంత్రి ఎక్కడ? పీఆర్సీ ఎపిసోడ్‌లో కనిపించని బుగ్గన..

ఏపీలో ప్రస్తుతం పీఆర్సీ చర్చ కొనసాగుతోంది.ఆ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

 Where Is The Ap Finance Minister Buggana Who Did Not Appear In The Prc Episode , Buggana, Ycp , Sajjala Ramakrishnareddy , Perni Nani-TeluguStop.com

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరగాలి.కానీ ఆయన ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు.

రాష్ట్రంలో మాత్రం బుగ్గన పనిని సజ్జల రామకృష్ణారెడ్డి చక్కబెడుతున్నారు.తాజాగా పీఆర్సీ వివాదం తలెత్తడంతో ఉద్యోగులు సమ్మెకు సైరన్ ఇచ్చారు.

 Where Is The AP Finance Minister Buggana Who Did Not Appear In The PRC Episode , Buggana, Ycp , Sajjala Ramakrishnareddy , Perni Nani-ఏపీ ఆర్థిక మంత్రి ఎక్కడ పీఆర్సీ ఎపిసోడ్‌లో కనిపించని బుగ్గన..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయంలోనూ ఏపీ ఆర్థిక మంత్రి ఎక్కడా కూడా కనిపించట్లేదు.ఆర్థిక మంత్రి లేకుండా మాతో ఏం మాట్లాడతారని ప్రభుత్వాన్ని సైతం ఒకానొక సందర్భంలో ఉద్యోగుల ప్రశ్నించారు.

దీంతో ఉద్యోగులతో మాట్లాడేందుకు ఒక సారి ఆయన చర్చలకు వచ్చారు.కానీ ఇలా కూర్చుని వారు చెప్పినంత వరకు విని ఇలా వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఉద్యోగులకు బుజ్జగించే పని కోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.ఆ కమిటీలో బుగ్గన ఉన్నా.

ప్రస్తుతం జరుగుతున్న కమటీ భేటీలకు ఆయన హాజరు కావడం లేదు.దీంతో ఆ కమిటీలో ప్రస్తుతం సజ్జల డామినేషన్ కనిపిస్తోంది.

ఓ వైపు మంత్రి పేర్ని నాని.మరో వైపు బొత్సను పెట్టుకుని మీడియాతో సజ్జలనే మాట్లాడుతున్నారు.ఉద్యోగులతో చర్చల గురించి ఆయనే మాట్లాడేస్తున్నారు.మరి పీఆర్సీ విషయంలో ఆయన ఎందుకు ఇంతలా చొరవ చూపుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.అన్ని విషయాలు సజ్జల చూసుకుంటున్నారు కదా.ఇక బుగ్గన ఎందుకు అని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు టాక్.మరి ఈ వ్యవహారంపై బుగ్గన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.ఆయన ఎంట్రీ ఇస్తే సజ్జల ఈ వ్యవహారం నుంచి తప్పుకుంటారా? లేక బుగ్గనపైన కూడా డామినేషన్ కొనసాగిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.మరి పార్టీ పెద్దలు సైతం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

Video : Where Is The AP Finance Minister? Buggana Who Did Not Appear In The PRC Episode, Buggana, Ycp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube