ఏపీలో పరకాల పాత్ర ముగిసినట్టేనా ..?       2018-05-22   02:37:58  IST  Bhanu C

ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు బీజేపీ – టీడీపీ కి మధ్య ఏర్పడిన విబేధాల వల్ల ఓ వ్యక్తి ఇప్పుడు కూరలో కరివేపాకులా మారాడు. ఒకప్పుడు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న ఆయన ఇప్పుడు అమరావతి ఛాయలకు కూడా రావడం మానేసాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి ..? ఎందుకు కరివేపాకులా మారాడు అనేది తెలుసుకుందాం. !

పరకాల ప్రభాకర్ ! కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు భర్త . ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారుడు. ఇతడికి ఒకప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇంపార్టెంట్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా కూడా పరకాల ఉండాల్సిందే. రాష్ట్రంలో కూడా ఏదైనా ముఖ్యమైన మీటింగ్ పెట్టినా అందులో పరకాల ప్రత్యక్షం అవ్వాల్సిందే. అంతగా ఆయనకు చంద్రబాబు ఇంపార్టెంట్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీతో పొత్తు చెడిన తరువాత ఇక పరకాల ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు అనే ఫీలింగ్ చంద్రబాబు లో వచ్చేసింది. పైపెచ్చు ఆయన్ను ఇంకా పక్కనపెట్టుకుని తిరగడం ఎప్పటికైనా డేంజర్ అనే భావన రావడం వల్ల ఆయనకు ఇంపార్టెంట్ కావాలనే తగ్గించేసారు.

ఒకప్పుడు బీజేపీ నేతగా ఉన్న పరకాల ప్రభాకర్‌కు ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అదే ఆయన కు శాపం అయ్యిందని తెలుస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను కేంద్రంలోని బిజెపితో…ప్రధాని నరేంద్రమోడీతో అలుపెరగని పోరాటం చేస్తున్నానని పదే పదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పరకాలను పక్కన పెట్టుకుని చంద్రబాబు బిజెపితో పోరాటం చేస్తున్నానంటే ఎవ్వరు పెద్దగా నమ్మరు. ఇదే విషయాన్ని గ్రహించిన బాబు కావాలనే పరకలను దూరం పెట్టాడు.

ఈ మధ్య జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గ్రూప్ కంపెనీలకు చెందిన సంజయ్ ఆరోరాను కమ్యూనికేషన్ల సలహాదారుగా ప్రకటించారట దీంతో అక్కడే ఉన్న పరకాల ఈ నిర్ణయం వినగానే వెంటనే అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారట. ఇక అప్పటి నుంచి మళ్లీ అమరావతి అడుగు పెట్టలేదని తెలుస్తోంది. కావాలనే నాకు ప్రాధన్యత తగ్గించారని గ్రహించిన పరకాల అలకబూని దూరంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

,