టీడీపీ మటాష్ అవుతుందా? వైసీపీ వ్యూహమేంటి?

ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో టీడీపీ సైకిల్‌కు బ్రేకులు తీయడానికి అధికార పార్టీ వైసీపీ సమాయత్తం అవుతోంది.

 Will The Tdp Be Empty In Andhra Pradesh What Is The Ycp Strategy Details, Andhra Pradesh, Telugu Desam Party, Ysrcp, Operation Akarsh, Ke Krishna Murthy, Minister Kakani Govardhan Reddy, Cm Jagan Mohan Reddy, Ycp Operation Akarsh, Chandrababu Naidu-TeluguStop.com

వైసీపీ తీసుకోబోయే చర్యలతో టీడీపీ మటాష్ అవుతుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.దీంతో టీడీపీ జోరు తగ్గేందుకు వైసీపీ ఏం చేయబోతుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొత్త చెప్పిన మాట ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఇతర పార్టీ నేతలు తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని.

 Will The TDP Be Empty In Andhra Pradesh What Is The YCP Strategy Details, Andhra Pradesh, Telugu Desam Party, Ysrcp, Operation Akarsh, Ke Krishna Murthy, Minister Kakani Govardhan Reddy, Cm Jagan Mohan Reddy, Ycp Operation Akarsh, Chandrababu Naidu-ఏపీలోనూ టీడీపీ మటాష్ అవుతుందా వైసీపీ వ్యూహమేంటి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీ నేతలను తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.అందుకే టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌కుమార్ లాంటి ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్నారు తప్పితే తమ పదవులకు రాజీనామాలు చేయలేదు.

టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు జగన్ అధికారికంగా పార్టీ కండువాలు అయితే కప్పలేదు.

కానీ వీళ్లంతా వైసీపీ సపోర్టర్లుగా చలామణి అవుతున్నారు.వైసీపీ అధికారికంగా చేర్చుకున్నా.చేర్చుకోకపోయినా టీడీపీకి మాత్రం జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

రాజకీయాలు ఇలా కూడా చేయవచ్చా అని చంద్రబాబు లాంటి రాజకీయ పండితుడే విస్తుపోయేలా జగన్ ఈ ఫిరాయింపుల కథను నడిపారు.

తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.టీడీపీని ఖాళీ చేస్తామని ఆయన పరోక్షంగా హెచ్చరించడం చూస్తుంటే త్వరలో వైసీపీ వాళ్లు ఆపరేషన్ ఆకర్ష్ పథకం అమలు చేయబోతున్నారని అర్ధమవుతోంది.కర్నూలు జిల్లాతోనే ఈ ప్రక్రియకు వైసీపీ శ్రీకారం చుట్టబోతుందని టాక్ నడుస్తోంది.

ఈ జిల్లాలో బలమైన బీసీ నేత కేఈ కృష్ణమూర్తి టీడీపీకి కీలకంగా ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో సీనియర్లను పక్కన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్న తరుణంలో కేఈకి టిక్కెట్ దక్కదనే పుకార్లు వినిపిస్తున్నాయి.

దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని.అందుకే ఆయన్ను వైసీపీలోకి లాగాలనే ప్రయత్నాలు జోరుగా నడుస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube