ఏడు శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తప్పకుండా తీరతాయి  

మనకు శనివారం అనగానే ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు.ఆయనను వేడుకుంటే శని వలన కలిగే బాధలు అన్ని తొలగిపోతాయి.అందువల్ల నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలు దోషాలు ఏమి ఉండవు.ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం ఆంటే చాలా ప్రీతి.అందువల్ల ఏడు శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకొన్న కోరికలు తప్పనిసరిగా తీరతాయి.

%e0%b0%8f%e0%b0%a1%e0%b1%81 %e0%b0%b6%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 %e0%b0%87%e0%b0%b2%e0%b0%be %e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87--

ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాంశనివారం ఉదయం తలస్నానము చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకొని స్వామికి అలంకరణ చేసి సంకల్పం చెప్పుకోవాలి.ఆ తర్వాత బియ్యంపిండితో ప్రమిద చేయాలి.బియ్యంపిండిలో పాలు,బెల్లం ముక్క, అరటిపండు వేసి చపాతీ పిండిలా కలిపి ప్రమిద చేయాలి.

ఈ ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి.శనివారం సూర్యోదయం ముందు నిద్ర లేచి తులసి కోట ముందు నువ్వులనూనె లేదా నేతితో దీపాన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు పొందటమే కాకుండా లక్ష్మి దీవి ఇంటిలో ఎప్పుడు కొలువై ఉంటుంది.శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేతి దీపం వెలిగిస్తే బాధలు పోయి సుఖ శాంతులు కలుగుతాయిఈ విధంగా క్రమం తప్పకుండ ఏడు శనివారాలు చేస్తే దోషాలు అన్ని పోయి అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి.

కాబట్టి ఏడు శనివారాలు ఈ విధంగా ఆచరించి స్వామి వారి కృపను పొందండి.