ఎవరండి ఈ బిగ్ బాస్ 2 కాంటెస్టెంట్స్ ? ఏ మాత్రం పరిచయం లేని సెలెబ్రిటీలు వీళ్ళే...       2018-06-11   01:12:43  IST  Raghu V

గత సంవత్సరం తెలుగు లో కి వచ్చిన బిగ్ బాస్ షో ఎన్టీఆర్ హోస్టింగ్ తో అందులో పాల్గొన్న కాంటెస్టెంట్స్ తో మంచి పేరుని తెచ్చుకుంది.ఆ సీజన్ చాలా భావోద్వేగాలు, నవ్వుల మధ్య సాగింది. అందులో పాల్గొన్న వాళ్ళందరిలో కొందరు అయిన ఆడియన్స్ కి తెలిసిన వాళ్ళు ఉన్నారు.దానితో ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు.

నిరాశ పరిచిన బిగ్ బాస్ సెలబ్రిటీ లిస్ట్

బిగ్ బాస్ సీజన్ 2 లో కాంటెస్టెంట్స్ లో ఒక తనీష్ , తేజస్వి మడివడ మాత్రమే కాస్త ఎక్కువ పాపులర్ సెలబ్రిటీస్ వీరితో పాటు పాటలు పాడే గీతా మాధురి.. విలన్ రోల్స్ చేసే అమిత్ తివారి.. టివి9 యాంకర్ దీప్తి నల్లమోతు.. డిబేట్లు చేసే బాబు గోగినేని.. వీరి వరకు కూడా పర్లేదనే చెప్పాలి. అయితే తక్కిన కంటెస్టంట్లు మాత్రం జనాలకు అంతగా సుపరిచితం కాదు. జూనియర్ ఆర్టిస్ట్ కమ్ డ్యాన్సర్ భాను శ్రీ.. రాప్ గాయకుడు రోల్ రిదా.. యాంకర్ శ్యామల.. నటుడు కిరీటి దామరాజు.. ఇనస్టాగ్రామ్ బ్యూటి దీప్తి సునయన.. నటుడు కౌశల్.. నటుడు సామ్రాట్ రెడ్డి.. ఒక చిన్న RJ గణేష్.. విజయవాడ మోడల్ సంజనా అన్నే.. మరియు వైజాగ్ బిజినెస్ మ్యాన్ నూతన్ నాయుడు.. ఇలా లిస్టు పెద్దగానే ఉంది. వీరిలో చాలామంది ఎవ్వరికీ తెలియని ముఖాలే, వీరు బిగ్ బాస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారో వేచి చూడాలి.

ఎన్టీఆర్ హోస్టింగ్ ఎక్కడ , నాని హోస్టింగ్ ఎక్కడ

ఇదంతా ఒక ఎత్తు అయితే హోస్ట్ గా చేస్తున్న నాని పైన అప్పుడే విమర్శనలు మొదలయ్యాయి.గత సీజన్ లో ఎన్టీఆర్ హోస్టింగ్ కి అలవాటు పడిపోయిన ఆడియన్స్ , ఈ సీజన్ లో కూడా అదే జోరు హుషారు కోరుకుంటున్నారు ఆడియన్స్.నేచురల్ స్టార్ గా పెరు తెచ్చుకున్న నాని నేచురల్ గా చేయకుండా కొంచం ఇబ్బంది గా చేస్తున్నట్లు కనిపిస్తుంది.