ఎమ్మెల్యేలకి ర్యాంకులు ప్రకటించిన చంద్రబాబు..టాప్ లో ఉంది వీళ్ళే       2018-05-12   04:03:17  IST  Bhanu C

ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతీ ఒక్కరు ప్రజలకి జవాబుదారీగానే ఉండాలి..వారి అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి సేవకులుగా ఉండాలి ఇదే పరిపాలనలో మొదటి సూత్రం..చంద్రబాబు ఇదే విషయాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉంటారు..అంతేకాదు తన ఎమ్మెల్యేలు మంత్రులు..ఎవరెవరు ఎలా పని చేస్తున్నారు..?వారికి ఇచ్చిన భాద్యతలు ఎలా నిర్వరిస్తున్నారు అనే విషయం పై ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటారు ..చంద్రబాబు..

అయితే ఆ రిపోర్ట్ ల ఆధారంగానే ఎమ్మెల్యేలకి ర్యాంకులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది..టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం తాజా గా సర్వే చేయించారు… 70శాతానికిపైగా ఎమ్మెల్యేల పని తీరు బావుంది అని, మిగతా వారు పని తీరు మార్చుకోకపోతే వారిని నేనే మార్చాల్సి వస్తుందని అన్నారు పని తీరు బావున్న ఎమ్మెల్యేల పేర్లను ముఖ్యమంత్రి స్వయంగా చదివి ఆయన వినిపించారు…అయితే ఈ సర్వేలని ఏ ప్రమాణాల ఆధారితంగా తీసుకున్నారంటే..ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజాసమస్యల పరిష్కారం.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఆధారంగా ర్యన్కులని ప్రకటించారు..

జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు

అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం)

లలితకుమారి (విజయనగరం)

అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణ (విశాఖ)

తోట త్రిమూర్తులు, జోగేశ్వరరావు (తూ.గో)

చింతమనేని ప్రభాకర్‌, నిమ్మల రామానాయుడు, రాధాకృష్ణ (ప.గో)

వల్లభనేని వంశీ, శ్రీరాంతాతయ్య, బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ (కృష్ణా)

ధూళిపాళ్ల నరేంద్ర(గుంటూరు జిల్లా)

వీరి పనితీరు బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు…ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిదుల పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే…వారి పని తీరు పరంగా కూడా చంద్రబాబు బెస్ట్ ర్యాంకులు తెలిపారు

బెస్ట్ మీడియా పాయింట్ ప్రజెంటేషన్- వాసుపల్లి గణేష్

రెండో స్థానం- బుద్దా వెంకన్న

బెస్ట్ ప్రజెంటేషన్- దేవినేని ఉమా మహేశ్వరరావు

బెస్ట్ పొలిటికల్ పంచ్- అచ్చెన్నాయుడు

బెస్ట్ సప్లిమెంటరీ- ఎమ్మెల్యే వర్మ‌లుగా చంద్రబాబు ప్రకటించారు

మూడో స్థానం- జీవీ ఆంజనేయులు

అయితే చివరిగా మీటింగ్ ని ముగించే ముందు చంద్రబాబు పెద్ద బాంబు పేల్చారు ఇప్పుడు ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా టిక్కట్లు ఉంటాయని అనుకోవద్దని తప్పకుండా మళ్ళీ వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే టిక్కెట్స్ ఇస్తానని చెప్పేసరికి ర్యాంకులు పొందిన నేతల మొఖంలో చిరునవ్వు ఒక్క సారిగా ఎగిరిపోయింది..ఇదెక్కడి గోలరా బాబు అంటూ ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారట..ఎంతన్నా బాబు రూటే సపరేటు..