ఎంపీ సీటు కోసం బాలయ్యతో సినిమా!!  

యాక్షన్‌ సినిమాలకు, ఫ్యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరైన దర్శకుడు వివి వినాయక్‌ గత సంవత్సరం చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా రికార్డులను బ్రేక్‌ చేసింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీకే చెందిన సాయి ధరమ్‌ తేజ్‌తో ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అది అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది..

ఎంపీ సీటు కోసం బాలయ్యతో సినిమా!!-

ఒక వైపు సినిమాు చేస్తూనే మరో వైపు వినాయక్‌ రాజకీయాలపై కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈయనకు చాలా కాలంగా వైజాగ్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలనే ఆశగా ఉంది. అందుకోసం చాలా ప్రయత్నాలు చేశాడు. తెలుగు దేశం మరియు టీడీపీల్లో ఏ పార్టీ నుండి అయినా పోటీ చేయాలని భావించాడు.

వైకాపాలో ఉన్న కొడాలి నాని ఈయనకు సీటు ఇప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు, కాని అవి వర్కౌట్‌ కావడం లేదు..

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ తరపున పోటీకి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఆ పార్టీ మద్దతుదారులతో అప్పుడప్పుడు వినాయక్‌ చర్చలు జరుపుతున్నాడు.

ఇదే సమయంలో బాలకృష్ణతో ఒక సినిమాను వినాయక్‌ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే తనకు తెలుగు దేశం టికెట్‌ ఇప్పించాల్సిందిగా బాలయ్యను కోరే అవకాశం ఉంది. చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి ఉన్న బాలకృష్ణ ఖచ్చితంగా వినాయక్‌కు సీటు ఇప్పించగలడు అని కొందరు భావిస్తున్నారు.

సి కళ్యాణ్‌ తెలుగు దేశం పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నాడు. ఆయన ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

వినాయక్‌ ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు మద్దతుగా నిలిచేందుకు సి కళ్యాణ్‌ ముందు ఉన్నాడు.

ఖర్చు పెట్టేందుకు కళ్యాణ్‌ సిద్దంగా ఉన్నాడని, తప్పకుండా గెలుస్తాను అంటూ ధీమాతో బాలయ్య వద్ద వినాయక్‌ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి సినిమాను పూర్తి చేయడంపై శ్రద్ద పెట్టాలని, ఎన్నికల సమయంలో సీటు గురించి చంద్రబాబు వద్ద చర్చిద్దాం అంటూ బాలయ్య హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ వైజాగ్‌ పార్లమెంటు స్థానం నుండి వినాయక్‌ పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

ఒక వేళ టీడీపీలో వైజాగ్‌ పార్లమెంటు సీటు కన్ఫర్మ్‌ కాకుంటే వెంటనే జనసేనలోకి వెళ్లేందుకు సైతం వినాయక్‌ సిద్దంగా ఉన్నాడు. సినిమా పరిశ్రమలో తనకు ఆప్తుడు అయిన చిరంజీవి రికమండేషన్‌తో జనసేనలో వైజాగ్‌ పార్లమెంటు సీటును దక్కించుకోవాలని వినాయక్‌ భావిస్తున్నాడు. ఏది ఏమైనా 2019 పార్లమెంటు ఎన్నికల్లో వినాయక్‌ పోటీ చేయడం దాదాపు ఖాయం అని తేలిపోయింది. అయితే అది ఏ పార్టీ నుండి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

త్వరలోనే ఆ విషయంపై కూడా క్లారిటీ వస్తుందేమో చూడాలి.