ఎంపీ సీటు కోసం బాలయ్యతో సినిమా!!     2018-05-15   21:59:49  IST  Raghu V

యాక్షన్‌ సినిమాలకు, ఫ్యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరైన దర్శకుడు వివి వినాయక్‌ గత సంవత్సరం చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా రికార్డులను బ్రేక్‌ చేసింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీకే చెందిన సాయి ధరమ్‌ తేజ్‌తో ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అది అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

ఒక వైపు సినిమాు చేస్తూనే మరో వైపు వినాయక్‌ రాజకీయాలపై కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈయనకు చాలా కాలంగా వైజాగ్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలనే ఆశగా ఉంది. అందుకోసం చాలా ప్రయత్నాలు చేశాడు. తెలుగు దేశం మరియు టీడీపీల్లో ఏ పార్టీ నుండి అయినా పోటీ చేయాలని భావించాడు. వైకాపాలో ఉన్న కొడాలి నాని ఈయనకు సీటు ఇప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు, కాని అవి వర్కౌట్‌ కావడం లేదు.