ఈ మొక్క పోషకాలు తల్లిపాలలో కూడా ఉండవట.       2017-09-15   23:42:20  IST  Lakshmi P

ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదు అని అంటారు.. ఇప్పుడు ఆ కోవలోకే ఒక మొక్క వచ్చి చేరింది..తల్లి చేసే మేలుకు సమానంగా ఈ మొక్క కూడా చేస్తుంది. ఇది ఎవరో చెప్పిన విషయం మాత్రం కాదు..ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన కామెంట్స్.. తల్లి పాలతో సమానంగా పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలు ఈ మొక్కలో ఉన్నాయి అని గుర్తించింది.ఇది సముద్రగర్భం లో పెరుగుతుంది.ఈ మొక్కయొక్క ఆకుల పొడి బహిరంగ మార్కెట్ లో ఒక గ్రాము –2 రూపాయలు వరకూ ఉంది.ఇది పొడి రూపంలో కూడా దొరుకుతుంది. ఇంతకీ ఈ మొక్క పేరు ఏమిటి అని ఆలోచిస్తున్నారా..దీని పేరు “స్పిరులినా”

ఈ మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. సాథారణ పాలతో పోల్చుకుంటే 26 రెట్లు అధికంగా ఉంటుంది.అందుకే ఈ మొక్కని తిన్న వాళ్ళ శక్తి సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా క‌ణ‌జాలాల మ‌ర‌మ్మ‌త్తుల‌కు, కొత్త క‌ణ‌జాలం పెరిగుదలకు ప్రోటీన్లు అవసరం. అందుకే 60 శాతం వ‌ర‌కు ప్రోటీన్లు కలిగిన ఈ మొక్క పొడిని తింటే చాలు.

ఇప్పటివరకూ మార్కెట్‌లో ఉన్న అన్ని ఆహార ప‌దార్థాల్లోకెల్లా అత్యంత గ‌రిష్టంగా ప్రోటీన్లు క‌లిగిన ఆహారం ఇదే. శాకాహారుల కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నో ప్రోటీన్లు ల‌భిస్తాయి.ర‌క్తాన్ని శుద్ది చేయడంలో మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో దీనిలో ఉండే క్లోరోఫిల్ బాగా పనిచేస్తుంది. నరాల బలహీనతలు,గుండె సంభందిత వ్యాదులు ఏమి కూడా రాకుండా కాపాడుతుంది.