సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతూ వస్తున్నాడు.
ఇక ఇప్పటికి కూడా ఆయన స్టార్డం అనేది చెక్కుచెదరకుండా ఉండటం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇప్పటికే యంగ్ హీరోలు( Young Heroes ) సైతం చిరంజీవితో పోటీ పడలేక చేతులెత్తేస్తున్నారు.
అలాంటి చరిష్మా ఉన్న చిరంజీవి తో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి ఉంటుంది.ఇక ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి తో సినిమా చేయాలని ఇండస్ట్రీకి వచ్చిన దర్శకులు చాలామంది ఉన్నారు.
పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ లాంటి వాళ్లు చిరంజీవితో కనీసం ఒక్క సినిమా అయిన చేయాలని అనుకుంటున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవితో సినిమా ఓకే అయి ఆ తర్వాత క్యాన్సల్ అయిన డైరెక్టర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…ఇంద్ర సినిమా తర్వాత చిరంజీవి బి.గోపాల్( Director B Gopal ) డైరెక్షన్ లో మరొక సినిమా చేయాలనుకున్నాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయినప్పటికీ ఆ సినిమాని చేసే ముందే ఆ సినిమా క్యాన్సిల్ అయింది.
దానికి కారణం ఏంటి అంటే బడ్జెట్ ప్రాబ్లమ్ అని తెలుస్తుంది.ఎందుకంటే భారీ బడ్జెట్( Hea;vy Budget ) తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు.కానీ ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ కనక అయితే ప్రొడ్యూసర్ కి భారీగా నష్టాలు వస్తాయి అనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఆ సినిమాను అపేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి…
ఇక రీసెంట్ గా వెంకీ కుడుముల( Venky Kudumula ) డైరెక్షన్ లో కూడా చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడనే టాకైతే వచ్చింది.ఇక ఆల్మోస్ట్ అనౌనన్స్ మెంట్ దాకా వచ్చిన ఈ సినిమా ఆగిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే చిరంజీవి అలోపే విశ్వంభర అనే సినిమాకి కమిట్ అవ్వడం తో ఈ సినిమాను హోల్డ్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది…